ఇండియా బ్లాక్ నిరసన రేపటికి వాయిదా

ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో ప్రతిపక్షాల ఇండియా కూటమి నిర్వహించ తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమానికి ముందు రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి తరలివస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలను కేంద్ర హోంశాఖ అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే నిరసనలను అణచివేయడానికి కేంద్రం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ వంటి పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది ఢిల్లీకి రాకుండా ఆంక్షలు విధిస్తోన్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. కోట్లాది మంది పౌరుల ఓటు హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, ఇది ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసిందని చెప్పారు. ప్రతిపక్ష నేతలు కూడా ఢిల్లీకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటోండటం ఈ ప్రజాస్వామ్య దేశంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోందని మండిపడ్డారు.

India Bloc have decided to postpone Public impeachment due to rain in Delhi Rahul Gandhi confirms

పౌరులకు లభించిన ఓటు హక్కును అక్రమ మార్గాల్లో తొలగించడం పట్ల రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కొద్దిమంది బడా కార్పొరేట్ దిగ్గజాలు, అధికార పీఠంలో ఉన్న పాలక వర్గాల ప్రయోజనాల కోసమే ఈ రకమైన చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము తలపెట్టిన ఈ పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, రాజ్యాంగ విలువలు, పౌరుల ప్రాథమిక ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమై సాగిస్తున్న ఉమ్మడి పోరాటమని అభివర్ణించారు.

మియాపూర్ లో 550 ఎకరాలపై సుప్రీంకోర్టు తుది తీర్పు
మియాపూర్ లో 550 ఎకరాలపై సుప్రీంకోర్టు తుది తీర్పు

ప్రజాస్వామ్య సూత్రాలను బలహీనపరిచే చర్యలకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ లోని అన్ని భాగస్వామ్య పక్షాలు ఒకే తాటిపైకి వచ్చాయని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి నిరసన తెలపాలనుకునే ప్రతి ఒక్కరినీ ఈ పోరాటంలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమతో కలిసి నడవాలని కోరారు.

మల్లారెడ్డి కాలేజీలపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు- నోటీసులు?
మల్లారెడ్డి కాలేజీలపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు- నోటీసులు?

కాగా.. ప్రతిపక్ష కూటమి తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అత్యవసరంగా సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. ఈ సాయంత్రం ఖర్గే నివాసంలో నిర్వహించ తలపెట్టిన జ్ఞానేష్ కుమార్ పబ్లిక్ ఇంపీచ్మెంట్ కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేశారు. సీనియర్లను వర్షంలో కూర్చోబెట్టడం సరికాదని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రామలీలా మైదానంలో నిర్వహించే ఈ ర్యాలీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం విధించే ఆంక్షలు, పోలీసుల అడ్డంకులను దాటుకుని వేలాది మంది కార్యకర్తలను విజయవంతంగా సమీకరించడం ద్వారా తమ పొత్తుల ఐక్యతను, బలప్రదర్శనను చాటాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఒకవైపు చట్టసభల్లోనూ, మరొకవైపు వీధుల్లోనూ ఒకేసారి పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా పాలకపక్షంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+