పాకిస్తాన్‌తో యుద్ధం తప్ప.. మరో ఆప్షన్ లేదు: ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో నిత్యం పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడులకు తెగబడటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదానికి ముగింపు పలకపోతే పాకిస్తాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు.
శనివారం తెల్లవారుజామున సంజ్వాన్‌లోని ఆర్మీ శిబిరంపై పాక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందగా, మరో నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.
పాకిస్తాన్ ప్రతిరోజూ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతోందని, భారత్‌పై పాక్ ఉగ్రవాదులు దాడులు చేయని రోజే లేదంటూ ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. ఉగ్రవాద శక్తులను ప్రోత్సహించడం, వారికి ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు ఇలాగే కొనసాగిస్తే పాకిస్తాన్‌పై యుద్ధం చేయడం తప్ప మనకు మరో ఆప్షన్ లేదన్నారు.

భారత్ నుంచి శాంతిని మాత్రమే కోరుకునేటట్లయితే పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాదానికి ముగింపు పలకాలని, లేనిపక్షంలో భారత్ నుంచి యుద్ధమే సమాధానం అవుతుందని హెచ్చరించారు. భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటే పాక్ తన వైఖరిని మార్చుకోవాలన్నారు.
అసలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి దూరంగా ఉండటమే మంచిదని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. నిజానికి యుద్ధం వల్ల రెండు దేశాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అయితే పాకిస్తాన్ చర్యలు ఇలాగే కొనసాగితే ఇరు దేశాల నడుమ యుద్ధ వాతావరణం ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications