స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ భారత్ తోపాటు చైనాలోనూ ఉత్పత్తి: వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన
మాస్కో: రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తి భారత్ తోపాటు చైనాలోనూ జరగనుందన వెల్లడించారు. అంతేగాక, కరోనావైరస్‌ను ఎదుర్కొనే టీకా అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Recommended Video

టీకా అభివృద్ధి పరిశోధన కేంద్రం..
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో పుతిన్ మాట్లాడారు.ముందుగా నిర్దేశించుకున్న విధంగానే బ్రిక్స్ దేశాల టీకాల పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా చొరవతో రెండేళ్ల క్రితమే ఈ కేంద్రం ఏర్పాటుకు బ్రిక్ దేశాలు అంగీకరించిన విషయాన్ని పుతిన్ గుర్తు చేశారు.

భారత్ తోపాటు చైనాలోనూ స్పుత్నిక్ వీ ఉత్పత్తి..
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం బ్రెజిల్, భారత్‌తో రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. అంతేగాక, వ్యాక్సిన్ ఉత్పత్తిపై భారత్, చైనాలోని ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇవి కేవలం ఆయా దేశ అవసరాలకే కాకుండా ఇతర దేశాలకు సరఫరాకు కూడా అక్కడే ఉత్పత్తి చేస్తామని పుతిన్ వివిరంచారు.

ఇప్పటికే స్పుత్నిక్ వీ ఒప్పందం
కాగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తికి భారతదేశంలోని పలు సంస్థలతోపాటు హైదరాబాద్ నగరానికి చెందిన పలు ఫార్మా సంస్థలు కూడా ఒప్పందం పచేసుకోవడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరిగిన 12వ బ్రిక్స్ సదస్సులో భారత్ తోపాటు భాగస్వామ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసో ఈ సదస్సులో పాల్గొన్నారు. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని, కరోనాను పరస్పర సహకారంతో అంతం చేయాలని సదస్సులో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications