టార్గెట్ బీజేపీ, కీలక నిర్ణయం దిశగా - ముహూర్తం ఫిక్స్..!!

కేంద్రంలో బీజేపీ లక్ష్యంగా ప్రతిపక్ష కూటమి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా సమావేశం ఈ నెల 31, సెప్టెంబర్ 1న ముంబాయిలో మూడో విడత సమావేశానికి నిర్ణయించాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. పార్లమెంట్ ఎన్నికల వేళ ఐక్య కార్యాచరణ తో పాటుగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా బీజేపీ పై ఇక క్షేత్ర స్థాయిలో పోరాటానికి ప్రతి పక్ష కూటమి పార్టీలు సమరశంఖం పూరించనున్నాయి.

కీలక సమావేశానికి సిద్దం: కేంద్రంలో బీజేపీని గద్దె దించటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి పార్టీలు కీలక సమావేశానికి ముహూర్తం ఖరారు చేసాయి. గత నెలలో బెంగళూరులో భేటీ నిర్వహించిన ఈ పార్టీలు ఈ సారి ముంబాయి లో సమావేశం కానున్నాయి. ఆగస్టు 31న పార్టీ నేతలు ఇష్టాగోష్టీలో పాల్గొంటారు. మరుసటి రోజున ప్రధాన సమావేశం నిర్వహణకు నిర్ణయించారు.

INDIA coalition likely to hold its next meeting on August 31 and September 1 in Mumbai

అదే రోజు సాయంత్రం నేతల ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ముంబాయిలో జరిగే ఈ సమావేశానికి థాక్రే శివసేన, ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ సమావేశంలోనే సమన్వయ..సమాచార కోసం ప్రత్యేక కమిటీలను ప్రకటించనున్నాయి.

కమిటీల ఏర్పాటు: ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి ఐక్యంగా వ్యవహరించింది. వచ్చే వారం మూడు రోజుల పాటు అవిశ్వాసం పైన చర్చ..10న ప్రధాని సమాధానం ఇవ్వనున్నారు. ఈ చర్చ సమయంలో ప్రధానంగా మణిపూర్ అంశం పైన ప్రధానితో సమాధానం చెప్పించాలనేది ప్రతిపక్ష కూటమి అసలు లక్ష్యం.

ఈ కూటమిలో ఇప్పటికే అభిప్రాయ బేధాలు వచ్చాయనే ప్రచారం సాగుతున్న ఈ సమయంలో నేతలంతా తాము ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే సమయంలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే నిర్ణయంతో పాటుగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఫార్ములా పైనా ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

పొత్తులు..లెక్కలు: జూన్ 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 పార్టీల నేతలు పాల్గొన్నారు. అదే సమయంలో, ప్రతిపక్ష పార్టీల రెండవ సమావేశం జులై 18న బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో 26 రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విపక్ష కూటమి పేరు ఖరారు చేసారు.

ఈ పేరు పైన ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యాయి. ఇప్పుడు ఢిల్లీ ఆర్దినెన్స్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించినా.. లోక్ సభలో మూజు వాణి ఓటుతో ప్రభుత్వం నెగ్గించుకుంది. ఎన్డీఏ కూటమి పైన స్పష్టత రావటంతో..ఎన్నికల కార్యాచరణే లక్ష్యంగా ఇండియా కూటమి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+