ఉగ్రవాదులపై యోగి ఫార్ములా- మొండిగోడలు కూడా మిగలవ్

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటనను ఇంకా విస్మరించకముందే మరో ఘాతుకం సంభవించింది. పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడి సామాజిక ఉద్యమకారులు, కార్యకర్తలపై తుపాకీ ఎక్కుపెట్టారు.

తాజాగా ఓ సామాజిక ఉద్యమ కార్యకర్తపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. రక్తస్రావం కావడం వల్ల కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడా సామాజిక ఉద్యమ కార్యకర్త.

India destroyed house allegedly linked to a terrorist in Jammu Kashmir

అర్ధరాత్రి దాటిన తరువాత కుప్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన పేరు- గులాం రసూల్ మాగ్రే. జిల్లాలోని కండీఖాస్‌లో నివాసం ఉంటోన్నారు. ఇంట్లో నిద్రిస్తోన్న సమయంలో బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన తరువాత భద్రత బలగాలు అప్రమత్తం అయ్యాయి. కుప్వారా జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సమీప అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ సైతం నిర్వహించాయి.

అదే సమయంలో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరంగా కొనసాగిస్తోన్నారు భద్రత సిబ్బంది. వాళ్ల నివాసాలను కూల్చివేస్తోన్నారు. బాంబులతో పేల్చివేస్తోన్నారు. ఇప్పటివరకు 11 మంది కరడుగట్టిన టెర్రరిస్టుల నివాసాలను నేలమట్టం చేసిపడేశారు. వాళ్లకు నిలువ నీడ లేకుండా చేశారు.

కాశ్మీర్‌ ఉత్తర ప్రాంతంలోని కుప్వారా జిల్లాలోని నారికూట్ కల్రూస్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ టిడ్వా ఇంటిపై ఆర్మీ అధికారులు బాంబుదాడి చేశారు. ఇంటిని పేల్చివేశారు. ఫరూఖ్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంటోన్నాడు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరింపజేయడానికి ఆ దేశ సైన్యంతో కలిసి పనిచేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

పుల్వామా జిల్లాలోని త్రాల్ సమీపంలోని ఖాసీపొరాలో జేషె మహ్మద్ ఉగ్రవాది అమీర్ నాజిర్ వణి ఇంటిని కూడా కూల్చివేశారు. ఇప్పటివరకు 11 మంది ఉగ్రవాదుల నివాసాలు నేలమట్టం అయ్యాయి. ఉగ్రవాదుల ఈ ఏరివేత, వారి నివాసాల కూల్చివేత మున్ముందు మరింత ఉధృతంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.

ఇంతకుముందు- పహల్గామ్‌లో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదుల్లో ముగ్గురి నివాసాలను బాంబులతో పేల్చివేశారు. కాశ్మీరీ ముస్లిం ఉగ్రవాదులకు చెందిన మరో రెండు నివాసాలు ధ్వంసం అయ్యాయి. కాశ్మీర్‌ దక్షిణ ప్రాంతం పుల్వామా సమీపంలోని ముర్రాన్‌లో ఎహసాన్ ఉల్ హక్ షేక్ బాంబులతో పేల్చివేశారు.

పుల్వామాలోని కాచిపోరా ప్రాంతంలో జరిగిన పేలుడులో లష్కరే తొయిబా ఉగ్రవాది హరిస్ అహ్మద్ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. నేలమట్టం అయింది. ఛోటీపొరాలో మరో ఉగ్రవాది ఇంటిని నామరూపాల్లేకుండా చేశారు. శుక్రవారం రాత్రి గంట వ్యవధిలో ఈ ముగ్గురు ఉగ్రవాదుల నివాసాలు.. బాంబు పేలుళ్ల ధాటికి గురయ్యాయి. పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+