Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందుకే.. పాకిస్తాన్ తోెక ముడిచింది

ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.

ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

India downed 6 Pakistani aircraft

అదే సమయంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తాజాగా భారత వైమానిక దళం మొదటిసారిగా వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో అయిదు యుద్ధ విమానాలు సహా మొత్తం ఆరు పాకిస్తాన్ విమానాలను కూల్చివేసినట్లు ధృవీకరించింది.

గాలిలో ఉండగా ఆరు విమానాలను కూల్చివేశామని, అలాగే- పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై తాము జరిగిన వైమానిక దాడుల్లో ఆ దేశ ఎయిర్ బేస్ కూడా భారీ నష్టం వాటిల్లిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. బెంగళూరులో ఎయిర్ చీఫ్ మార్షల్ లక్మణ్ మాధవ్ కత్రే 16వ స్మారకోపన్యాసంలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఏపీ సింగ్ మాట్లాడుతూ.. మే 7న పహల్గామ్ దాడి తర్వాత జరిగిన ఆపరేషన్‌ సింధూర్ లో భారత్ ఘన విజయం సాధించడంలో ఎస్-400 సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ కీలకంగా వ్యవహరించిందని అన్నారు. తమ దాడిలో పాకిస్తాన్ కు చెందిన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ధ్వంసమైందని, దీని నష్టం పాకిస్తాన్ వైమానిక బలం నిర్వీర్యమైందని చెప్పారు.

పాకిస్తాన్‌లోని జకోబాబాద్, భోలారీల్లోని హ్యాంగర్‌లను కూడా లక్ష్యంగా చేసుకున్నామని ఏపీ సింగ్ వివరించారు. జకోబాబాద్ లో ఎఫ్-16 యుద్ధ విమానాలు, భోలారీలో ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ధ్వంసమైనట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అవి వాస్తవమేనని తాజాగా ఏపీ సింగ్ నిర్ధారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ వైమానిక దళాలు భారీ నష్టాన్ని కలిగించడంతో.. పాకిస్తాన్ యుద్ధాన్ని కొనసాగించలేక చేతులెత్తేసిందని ఏపీ సింగ్ అన్నారు. ఈ యుద్ధాన్ని కొనసాగించితే మరింత మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ దేశం గ్రహించిందని, ఆ పరిణామమే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరడానికి దారితీసిందని ఆయన అన్నారు.

దాడులను ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినందుకు రాజకీయ నాయకత్వాన్ని కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ ప్రశంసించారు. ఈ విజయానికి ముఖ్య కారణం రాజకీయ సంకల్పమేనని, దాడులకు సంబంధించినంత వరకు తమకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఎటువంటి ఆంక్షలు కూడా విధించలేదని చెప్పారు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాలకు ఏవైనా పరిమితులు ఉంటే, అవి తమకు తాముగా తీసుకున్నవేనని అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పై యుద్ధాన్ని కొనసాగించే విషయంలో ఎంతవరకు ముందుకు వెళ్లాలో అంత వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, తమకు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు గానీ, అడ్డంకులు గానీ ఎదురు కాలేదని అన్నారు.

తాము ముందుగా నిర్దేశించుకున్న వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ లభించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు. మే 7న జరిగిన దాడిలో లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన కొన్ని శాటిలైట్ ఫొటోలను కూడా ఆయన ప్రదర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+