రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం.. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు తెలుసా!

Hydrogen Train: భారత ప్రజా రవాణా రంగంలో నేడు(జులై 17) చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఇప్పటివరకు మనం రోడ్లపై ఎలక్ట్రిక్, సీఎన్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వంటి స్వచ్ఛమైన, పర్యావరణహిత వాహనాలను చూశం. కానీ ఇప్పుడు భారతీయ రైల్వే సరికొత్త చరిత్రను సృష్టిస్తూ హైడ్రోజన్ రైలును పట్టాలెక్కించింది. అవును ఇప్పుడు రైల్వే ట్రాకులపై హైడ్రోజన్ రైళ్లు నడవనున్నాయి. హర్యానాలోని జింద్-సోనిపత్ మధ్య తన మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ రైలును ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. నేడు(జులై 1) ప్రధాని నరేంద్ర మోదీ దీనిని జెండా ఊపి అధికారికంగా ప్రారంభిస్తున్నారు. ఈ రైలు డీజిల్ ఇంజిన్లపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశపు హరిత రవాణా దార్శనికతను సాకారం చేసే దిశగా ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద ముందడుగు.ఇక భారతదేశపు రైళ్లు ఇకపై స్వచ్ఛమైన, పర్యావరణహితమైన ఇంధనంతో నడుస్తాయి.ఈ హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ రైలు పర్యావరణ పరిరక్షణకు, ఆధునిక సాంకేతికతకు ఓ ప్రధాన ఉదాహరణ. దీని సుదూర ప్రభావం భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తుంది.

అదే మా కొంపముంచింది.. కార్డిఫ్ వన్డేలో ఓటమిపై గిల్ ఆవేదన!
అదే మా కొంపముంచింది.. కార్డిఫ్ వన్డేలో ఓటమిపై గిల్ ఆవేదన!


మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పూర్తి ఫీచర్లు

1200 kW సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ వ్యవస్థ
జింద్-సోనిపత్ మార్గంలో నడిచే ఈ రైలు 1200-కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ రైలు ప్రతిరోజూ రెండు ట్రిప్పులు (రైలు నంబర్లు 74010, 74009) నడుపుతూ, ఒక్కో ట్రిప్పులో సుమారు 356 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు 90 కిలోమీటర్ల ప్రయాణాన్ని సుమారు రెండు గంటల్లో పూర్తి చేస్తుంది. ఒకేసారి 682 మంది ప్రయాణికులను తీసుకువెళుతుంది.

India First Hydrogen Train Launched in Haryana Discover its Route Speed Capacity and Key Features Explained

సున్నా ఉద్గార సాంకేతికత, పనితీరు
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అతిపెద్ద ప్రయోజనం దాని సున్నా ఉద్గారాలు. సాంప్రదాయ డీజిల్ ఇంజిన్‌ల వలె కాకుండా.. ఇది హైడ్రోజన్, ఆక్సిజన్‌ల రసాయన కలయిక ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. కేవలం నీటి ఆవిరిని మాత్రమే వ్యర్థంగా విడుదల చేస్తుంది. ఈ లక్ష్యంతో జింద్‌లో ఓ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు, ఇక్కడ విద్యుద్విశ్లేషణ ప్రక్రియ ద్వారా ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తారు.

వేగం, పరిధి
భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు, కానీ ఒక పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇది ప్రస్తుతం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఒక్కసారి ఇంధనం నింపితే ఈ రైలు 250 నుంచి 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అన్నింటికన్నా ముఖ్యంగా దీనికి ప్రత్యేకమైన ట్రాక్ అవసరం లేదు. ఇప్పటికే ఉన్న రైలు పట్టాలపైనే ఇది నడపగలదు.

చచ్చేవరకు సల్మాన్ నన్ను వదిలిపెట్టడు: బాలీవుడ్‌ను కుదిపేస్తున్న స్టార్ హీరోయిన్ కామెంట్స్!
చచ్చేవరకు సల్మాన్ నన్ను వదిలిపెట్టడు: బాలీవుడ్‌ను కుదిపేస్తున్న స్టార్ హీరోయిన్ కామెంట్స్!

ప్రపంచ దేశాల సరసన భారత్
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. భారతదేశపు విశాలమైన తీరప్రాంతం, సౌరశక్తి లభ్యత భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని మరింత సరసమైనదిగా మార్చడానికి దోహదపడతాయి. ఈ టెక్నాలజీ మొత్తం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌కు ఓ విప్లవాత్మక మార్పుగా నిరూపించబడవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+