ఒకే ఎమర్జెన్సీ నెంబర్: 2017 జనవరి నుంచి '112' సేవ
న్యూఢిల్లీ: అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది.. ఇలా అన్ని అత్యవసర సేవలన్నీ దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ '112' పైన త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 2017 జనవరి నెల నుంచి దీనిని ప్రారంభించనున్నారు.
ఎలాంటి అత్యవసర సేవల కోసమైనా ఉపయోగపడేలా 112 అనే ఫోన్ నెంబరుతో దేశవ్యాప్తంగా తీర్చిదిద్దబోతున్న సేవ 2017 జనవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.

అమెరికాలో 911 సంఖ్యతో ఉన్న సేవ తరహాలోనే దీనిని సిద్ధం చేయడానికి టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆమోదముద్ర వేశారు. బయటకు కాల్స్ చేసుకునే సదుపాయం లేని ఫోన్ల నుంచి సైతం ఈ నెంబరుకు కాల్ చేసుకోవచ్చు.
100, 101, 102, 108 వంటి అత్యవసర సేవల ఫోన్లన్నింటినీ దశల వారీగా ఏడాదిలోగా 112కు అనుసంధానం చేయనున్నారు. మెసేజ్, కాల్ చేయగానే వారి సమాచారం.. ఆ ప్రాంతంలో ఉన్న సేవా కేంద్రానికి వెళ్లిపోతుంది. అలాగే సంబంధిత డిపార్టుమెంటుకి కాల్ వెళ్తుంది. సిమ్ కార్డు లేదా ల్యాండ్ లైన్ ఫోన్లు తాత్కాలికంగా పని చేయకపోయినా ఈ నెంబర్ పైన సేవలు పొందవచ్చునని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications