కరోనా కల్లోలం - భారీగా పెరిగిన కేసులు : ప్రభుత్వం అలర్ట్..!!
దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 5,335కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనా కారణంగా మరణించినట్లు నిర్ధారించారు. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. మహారాష్ట్రలో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందస్తు చర్యలు ప్రారంభిస్తున్నారు.
దేశంలో కరోనా కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నమోదైన 5,335 కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,39,054 కు చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 25,587 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 94. 87 శాతంగా ఉంది.ఇక దేశంలో 13 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,929 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2826 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,82,538 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,18,366 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1,60,742 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ.తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5335 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా నమోదైన మరణాల్లో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇద్దరు చొప్పున, అదే విధంగా కేరళ, పంజాబ్, కేరళలో మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళలో మరోసారి కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది. గతంలోనూ మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరగటం..క్రమేణా దేశ వ్యాప్తంగా కేసులు వ్యాప్తి చెందాయి. కేంద్రం అన్ని రాష్ట్రాల అరోగ్య శాఖ కార్యదర్శులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించింది.
మాక్ డ్రిక్ ను నిర్ణయించింది. తమిళనాడు ఆస్పత్రుల్లో మాస్కు తప్పని సరి చేసారు. అదే విధంగా మహారాష్ట్ర - కేరళ లోనూ పరీక్షలు పెంచాలని కేంద్రం సూచించింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications