పరిస్థితులు బాగాలేవు- కేంద్ర ప్రభుత్వం
మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణ ప్రభావం.. క్రూడాయిల్ పై తీవ్రంగా పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా పెరిగింది. అమాంతం ఏడు శాతాన్ని దాటిపోయింది. ఫలితంగా దేశంలో ఇంధన ధరలు పెరుగుబాట పట్టొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో భగ్గుమంటోన్నాయి మధ్య- తూర్పు దేశాలు. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. తాజాగా ఇజ్రాయెల్.. ఇరాన్ పై దండెత్తింది. Raising Lion అని పేరుతో ముమ్మర దాడులు కొనసాగిస్తోంది.

ఈ దాడుల్లో- అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేన్ సలామీ మరణించినట్లు తెలుస్తోంది. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా దుర్మరణం పాలైనట్లు టస్మిన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ డిపోలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది టస్మిన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
దీనికి ప్రతీకారానికి దిగింది ఇజ్రాయెల్. ఇరాన్ నగరాలపై భారీగా బాలిస్టిక్ మిస్సైళ్లను సంధించింది. దాదాపుగా 200కి పైగా క్షిపణులను ప్రయోగించింది. అర్ధరాత్రి నుంచి రెండు విడతల్లో ఈ దాడి సాగింది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలు.. టెల్ అవివ్, జెరూసలేం సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో టెల్ అవివ్ లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పలు దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇజ్రాయెల్- ఇరాన్ గగనతలంపై తమ దేశాల పౌర విమానాలను రాకపోకలను మళ్లించాయి. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఎయిరిండియా సహా ఇతర విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోన్నాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ లల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. ఈ రీజియన్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్ లో నివసించే భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇజ్రాయెల్ అధికారులు,యు హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచించిన భద్రతా ప్రోటోకాల్ ను పాటించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని కోరింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తే ఏంబసీలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ +972 54-7520711 +972 54-3278392,ఇమెయిల్* [email protected]ను సంప్రదించాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications