ఒమిక్రాన్ దడ: మూడో వేవ్ ముప్పు, ఐఎంఏ వార్నింగ్
ఒమిక్రాన్ అంటేనే యావత్ ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. అంతా భయపడుతున్నారు. వైరస్ వేగంగా వ్యాపించడంతో టి మీద కునుకు లేకుండా పోతోంది. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలోఒమిక్రాన్ కలకలం మొదలైంది. భవిష్యత్‌లో ఒమిక్రాన్ తీవ్రత మరింత ఉండొచ్చనే నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తోంది.
ఒమిక్రాన్ వల్ల దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ అదనపు డోసును వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కోరింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోని కీలక రాష్ట్రాల్లో నమోదయ్యాయని.. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుందని చెప్పింది.
దేశంలో ఇప్పటికే 1.26 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను వేశారని, మొత్తం దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారని ఐఎంఏ తెలిపింది. వ్యాక్సిన్ వల్ల కరోనా ఇన్ఫెక్షన్ ను నిలువరించవచ్చనే విషయం ఇప్పటికే రుజువైందని చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై మనం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ఒమిక్రాన్ ప్రభావాన్ని కూడా ఎదుర్కోవచ్చని తెలిపింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని వారిపై ఫోకస్ పెట్టాలని తెలిపింది.

ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి మూడో డోసు వ్యాక్సిన్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది మెడికల్ అసోసియేషన్. వీరితో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలంది. ఒమిక్రాన్ వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండదని, డెల్టా వేరియంట్ కంటే 5 నుంచి 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పింది.వైరస్ కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Recommended Video
రెండేళ్లలో కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో వేరియంట్ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications