దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్
సరదాగా గడిపేందుకు అందరూ విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు కుటుంబంతో కలిసి వెళుతుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉండటానికి హోటల్ గదులను ఎంపిక చేసుకుంటారు. అయితే కొన్ని హోటల్ గదులు అత్యంత ఖరీదుతో ఉంటాయి. కొన్నిమాత్రమే అందుబాటు ధరలో ఉంటాయి. భారతదేశంలోనే ఖరీదైన హోటల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్టే చేయాలంటే చెప్పే రేటు వింటే కళ్లు బైర్లు కమ్మేస్తాయి.

శతాబ్దాల నాటి ప్యాలెస్‌లకు, విదేశీ సంస్కృతి, సంపన్నమైన రిసార్ట్‌లకు ప్రస్తుతం రాజస్తాన్ రాష్ట్రం ప్రధాన గమ్యస్థానంగా మారింది. ప్యాలెస్ లను, రిసార్ట్ లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి వాటిని విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్స్ గా మారుస్తున్నారు. ఈ క్రమంలోనే జైపూర్ లోని రాజ్ ప్యాలెస్ హోటల్ ప్రత్యేకతను సంతరించుకుంది. 300 సంవత్సరాల నాటి రాజభవనాన్ని హోటల్ గా మార్చారు. అందులోని ఇంటీరియర్ డిజైన్ చూస్తే మతిపోయినంత పనవుతుంది.

రాజ్ ప్యాలెస్‌లోని మహారాజా పెవిలియన్ సూట్ బంగారు ఫర్నిచర్ తో ఉంటుంది. ఒక ప్రైవేట్ పూల్, సొంత ప్రైవేట్ మ్యూజియం ఉంది. ఈ హోటలలో ఒక రూం ధర రూ. 29 లక్షలు. ఈ ధరతో దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్ గదిగా మారింది. జైపూర్‌లోని రాజ్ ప్యాలెస్ లోపల మహారాజాస్ పెవిలియన్ సూట్ ఉంది. ఇది బహుళ అంతస్తుల సముదాయం. నాలుగు అంతస్తులు, ప్రైవేట్ టెర్రస్, పూల్ ఉంటాయి. సూట్ లో నాలుగు బెడ్ రూమ్స్ ఉంటాయి. ప్రతి అంతస్తులో టెర్రస్ గార్డెన్, జ్యోతిష్యుల గది, ప్రయివేటు స్పా, విలాసవంతమైన డైనింగ్ హాల్, స్విమ్మింగ్ పూల్, గోల్డ్ ఫర్నిచర్ తోపాటు ప్రయివేటు మ్యూజియం కూడా ఉంది.

మాస్టర్ బెడ్‌రూమ్‌లోని గోడలు నిజమైన బంగారంతో, ఠాకూర్ సాహిబ్ రాజ సింహాసనంతో పెయింట్ చేశారు. ఒక గదిని బుక్ చేస్తే, ఒక ప్రైవేట్ బట్లర్‌తో పాటు డైనింగ్ రూమ్, ప్రపంచంలోని అత్యుత్తమ మద్యంతో నిండివున్న విలాసవంతమైన బార్‌ను పొందుతారు. ఈ గదిలో నివసించడంద్వారా 3 శతాబ్దాల క్రితం జైపూర్ రాజులు ఎలా నివసించారనేది తెలుస్తుంది.
-
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications