వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్లతో భారత్ చర్చలు -మోదీ విధానమేంటి?: అఫ్గాన్ సంక్షోభంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

బ్రిటిషర్లతో మూడు సార్లు భీకర యుద్ధాలు చేసి, భారత్ కంటే ముందుగానే స్వాతంత్ర్యం పొంది, 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్థాన్'గా కొనసాగిన దేశం కాస్తా, ఇప్పుడు తాలిబన్ల ఆక్రమణతో 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్'గా మారిపోయింది. అమెరికా సేనలు నిష్క్రమించిన వారాల వ్యవధిలోనే ఒక్కొక్కటిగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వచ్చిన తాలిబన్ సేనలకు.. అధ్యక్షుడు అష్రఫ్ ఘని పారిపోవడంతో రక్తపాతం లేకుండానే దేశం వశమైంది. ముల్లా బరాదర్ అధ్యక్షతన ఏర్పాటైన 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్' తాత్కాలిక ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు తాలిబన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అఫ్గాన్ లో పరిణామాలు అతి త్వరలోనే భారత్ పాలిట ఇబ్బందికరంగా మారబోతున్నాయని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరిస్తున్నారు..

Recommended Video

Former Afghan President Ashraf Ghani Fled With Cars, Chopper Full Of Cash, Claims Russia

మోదీ సర్కారుకు సీజేఐ రమణ మరో షాక్ -పెగాసస్ నిఘా కుట్రపై నోటీసులు -సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలుమోదీ సర్కారుకు సీజేఐ రమణ మరో షాక్ -పెగాసస్ నిఘా కుట్రపై నోటీసులు -సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు

తాలిబన్ల శాంతి మంత్రం..

తాలిబన్ల శాంతి మంత్రం..

అఫ్గానిస్థాన్‌.. ఇప్పుడు తాలిబన్ల రాజ్యం. తాత్కాలిక ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునే దిశగా నేతలు సన్నాహాల్లో మునిగిపోయారు. మరోవైపు తాలిబన్ల అరాచక పాలన ఎరిగిన ప్రజలు.. ప్రాణభయంతో దేశం విడిచి పారిపోతున్నారు. దీంతో అఫ్గాన్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించామని, ఎవరూ దేశం విడిచి వెళ్లొద్దని, ఉద్యోగులు తిరిగి విధులకు హాజరు కావాలని, మహిళల భద్రతపై స్పెషల్ ఫోకస్ పెడతామంటూ తాలిబన్ నేతలు శాంతి మంత్రాలు జపిస్తున్నా, గత అనుభవాల దృష్ట్యా అఫ్గానీలు ఆ మాటల్ని నమ్మడంలేదు. తాలిబన్ల నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇప్పటికే పాకిస్థాన్ గుర్తించి సమర్థించగా, చైనా, రష్యాలు సైతం సూత్రప్రాయ మద్దతును తెలిపాయి. కాగా, అప్గాన్ తో సరిహద్దును పంచుకునే భారత్ సైతం తాలిబన్ల విషయంలో కచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సిందేనని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఈ విషయాన్ని తాను చాలా ఏళ్లుగా పార్లమెంటులో వాదిస్తున్నప్పటికీ మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారాయన..

ఇండియాపై తాలిబన్ దాడి: యుద్ధానికి మోదీ సిద్ధంగా ఉండాలి -భారతమాత కోసం తప్పదన్న బీజేపీ స్వామి<br />ఇండియాపై తాలిబన్ దాడి: యుద్ధానికి మోదీ సిద్ధంగా ఉండాలి -భారతమాత కోసం తప్పదన్న బీజేపీ స్వామి

బరాదర్ ప్రభుత్వాన్ని గుర్తించకున్నా..

బరాదర్ ప్రభుత్వాన్ని గుర్తించకున్నా..

పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిన అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఇప్పటికే పలు దేశాలు గుర్తిస్తోన్న క్రమంలో భారత్ అనుసరించాల్సిన విధానాలపై హైదరాబాద్ ఎంపీ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లను ఇండియా గుర్తించినా గుర్తించకపోయినా వారితో చర్చలకు లాంఛనంగా మార్గాలను తెరిచి ఉంచాలని ఒవైసీ అన్నారు. వరుస ట్వీట్లు, మీడియా సమావేశాల్లో ఆయన ఈ మేరకు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియా వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు తాలిబన్లతో దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలని 2013లోనే తాను సలహా ఇచ్చానని, అయితే తన సలహాను ఖాతరు చేయలేదని, పైగా విమర్శించారని ఒవైసీ గుర్తుచేశారు. విచిత్రం కాకుంటే, బీజేపీ ఎంసీ సుబ్రమణ్య స్వామి కూడా దాదాపు ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేస్తూ ఇండియా యుద్దం చేయాలనీ కోరారు.

మోదీజీ విధానమేంటి?

మోదీజీ విధానమేంటి?

''అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత అక్కడ నెలకొనబోయే పరిస్థితులపై 2019లోనే సంబంధిత వాస్తవాలపై నేను పార్లమెంటులో మాట్లాడాను. నా ఆందోళన తెలియజేశాను. పాకిస్తాన్, అమెరికా, తాలిబన్లు మాస్కోలో చర్చలు జరుపుతుంటే, మన మోదీగారు మాత్రం ట్రంప్‌ను ఎన్నిసార్లు హగ్ చేసుకున్నారో పీఎంఓ లెక్కలు వేస్తూ వచ్చింది. ఈరోజుకు కూడా మోదీ సర్కారు అనుసరిస్తోన్న అఫ్గానిస్థాన్ విధానమేంటో ప్రజలెవరికీ తెలియడం లేదు. గడిచిన రెండు దశాబ్దాల్లో అఫ్గాన్ లో భారత్ భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేశాం..

తాలిబన్లతో చర్చలు చేయాలని చెప్పినా

తాలిబన్లతో చర్చలు చేయాలని చెప్పినా

అమెరికా తలపెట్టిన యుద్ధం వల్ల కునారిల్లిన అఫ్గానిస్థాన్ లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా భారత్ ఏకంగా 3 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. అఫ్గాన్ పార్లమెంట్ భవనాన్ని కూడా ఇండియానే నిర్మించింది. దాన్ని ఘని, మోదీ ఇద్దరూ కలిసి ప్రారంభించారు. ప్రస్తుతం తాలిబన్ల ఏలుబడిలోకి వెళ్లిన ఆ దేశం నుంచి రాయబారుల్ని, సిబ్బందిని రప్పించేందుకు విదేశాలు సైన్యాలను వాడుతోంటే, మన మోదీ సర్కారు ఏం చేస్తోంది? షరామామూలుగానే మోదీ ప్రభుత్వం సంక్షోభం తలుపుతట్టినప్పుడు నాటకాలు మొదలుపెడుతుంది. తాలిబన్లతో భారత్ కూడా చర్చలు జరపాలని అంతర్జాతీయ భద్రతా నిపుణులెందరో చెబుతున్నా మన సర్కారుకు పట్టింపు లేదు. నిజానికి అక్కడి పరిణామాల వల్ల..

అఫ్గాన్ పరిణామాలతో భారత్‌కు ముప్పు

అఫ్గాన్ పరిణామాలతో భారత్‌కు ముప్పు

అఫ్గాన్ లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితిని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాలిబన్లు లేదా అఫ్గాన్ ఆర్మీ కంట్రోల్ లో లేని పలు ప్రాంతాలను ఉగ్రవాదులు తమ అడ్డాలుగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే ఐసిస్, జైషే మొహ్మద్ లాంటి ఉగ్ర సంస్థలు తమ ప్రధాన క్యాంపులను అఫ్గానిస్థాన్ భూభాగానికి తరలించినట్లు రిపోర్టులు ఉన్నాయి. ఈ పరిణామాలు అతి త్వరలోనే భారత్ కు ముప్పు తెచ్చిపెడతాయి. కాబట్టి మనం తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించినా, గుర్తించకపోయినా దేశ ప్రయోజనాల దృష్ట్యా చర్చలు జరపాల్సిందే'' అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అఫ్గాన్ పరిణామాలతోపాటు చైనాతో సరిహద్దు వివాదాలపైనా ఎంఐఎం చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాపై ఎక్కువగా ఆధారపడడుతూ పోతే దాని ముందు తలవంచాల్సి వస్తుందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ కొట్టివేశారు. భగవత్ ప్రకటన పూర్తిగా బోగస్ అని అన్నారు. ''భారత భూభాగాలైన గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెమ్‌చోక్, డెప్సాంగ్‌లో చైనా తిష్టవేసినప్పుడు భగవత్ ఏం మాట్లాడారు? ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం చైనా అనే మాట మాట్లాడడానికి కూడా భయపడ్డారు. భారత భూభాగంలో చైనా తిష్టవేసిందని చెప్పగలరా?'' అని ఓవైసీ ప్రశ్నించారు.

English summary
Reacting to the deepening crisis in Afghanistan, AIMIM president and Hyderabad MP Asaduddin Owaisi said “whether or not India recognises Taliban, government will have to open channels of communication” with the hardline organisation that took over the war-torn nation.In a thread of three tweets, Owaisi said that it was not something that happened “out of the blue”. “As usual Narendraji’s govt seems to be out of its depth. It starts acting only when a crisis is at the doorstep,” he tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X