పలు నగరాల్లో లైట్లు ఆర్పేశారు..

న్యూఢిల్లీ: ఇవ్వాళ ఎర్త్ అవర్ (Earth Hour). భారత్ లోని పలు నగరాల్లో దీన్ని పాటించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 25వ తేదీ నాడు ఎర్త్ అవర్ ను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో గంట పాటు లైట్లను ఆర్పివేయడం వల్ల ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్టవుతుంది.

ఈ కాన్సెప్ట్ నేపథ్యంలో- దేశంలోని పలు నగరాల్లో ఇవ్వాళ ఎర్త్ అవర్ ను పాటించారు. సరిగ్గా రాత్రి 8: 30 గంటలకు విద్యుత్ దీపాలను ఆర్పివేశారు. 9:30 గంటల వరకు వాటిని వెలిగించలేదు. దేశ రాజధానితో పాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాజధానులు, ప్రధాన నగరాల్లో గంటపాటు విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆర్పివేశారు అధికారులు. చారిత్రాత్మక, వారసత్వ కట్టడాలు, రైల్వే స్టేషన్లు, వంతెనలు, ప్రధాన దేవాలయాలకు అలంకరించిన విద్యుత్ దీపాలను ఈ గంట పాటు ఆర్పివేశారు.

 India observed with lights switched off many cities including Mumbais CST for an earth hou

ఢిల్లీలోని ప్రఖ్యాత ఆలయం అక్షర్ ధామ్ కు అలంకరించిన విద్యుత్ దీపాలను సరిగ్గా 8:30 గంటలకు ఆర్పివేశారు. దీనితో సరికొత్తగా కనిపించిందా ఆలయం. అలాగే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ లైట్లను కూడా అధికారులు ఆర్పివేశారు. ప్రత్యేకంగా అమర్చిన ఎరుపురంగు ఎల్ఈడీ లైట్లతో మెరిసిపోతూ కనిపించిందా ప్రఖ్యాత రైల్వే స్టేషన్. చూసేవారికి సరికొత్త అనుభూతులను పంచిందీ ఘటన.


కోల్ కతలోని ప్రఖ్యాత హౌరా బ్రిడ్జికి అదనపు అందాలను కల్పిస్తూ అమర్చిన విద్యుత్ దీపాలను కూడా అధికారులు ఆర్పివేశారు. తక్కువ విద్యుత్ ను స్వీకరించే ఎల్ఈడీ బల్పుల వెలుగులో మరింత అందంగా కనిపించింది హౌరా బ్రిడ్జ్. చెన్నై రైల్వే స్టేషన్ సహా పలు చారిత్రక కట్టడాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+