దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఫిక్స్.. కేంద్రం కీలక ప్రకటన!

Population Census: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ(జనగణన) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా జనగణన చేపట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, మంచు ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది.

ఎరువులు, గ్యాస్‌పై పుకార్లు.. ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్!
ఎరువులు, గ్యాస్‌పై పుకార్లు.. ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్!

గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ జనగణనకు రెఫరెన్స్ తేదీగా 2027 మార్చి 1గా పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మణిపూర్, గోవా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లలోని అత్యంత మంచు కురిసే ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ వర్తించదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో జనగణన తేదీలను ఆ తర్వాత ప్రత్యేకంగా వెల్లడించనున్నారు. మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు సవరణల కోసం సమయం ఇచ్చారు.

India Population Census Dates Announced Census to Begin from Jan 25 2027 Check schedules self-enumeration dates
దీపావళి వేళ.. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
దీపావళి వేళ.. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలు సేకరించడానికి ముందే పౌరులు తమ వివరాలను తామే ఆన్‌లైన్లో నమోదు చేసుకునే స్వీయ నమోదు అవకాశాన్ని ఆప్షనల్ గా కల్పించారు. 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు ప్రజలు తమంతట తామే వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు సిబ్బంది ప్రత్యక్షంగా వివరాలు సేకరిస్తారు. ఇక జనగణన ముగిసిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకునేందుకు మార్చి 1 నుంచి మార్చి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నట్లు కేంద్రం ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+