అన్నదాతలకు డిజిటల్ భరోసా.. 11 కోట్ల మందికి రైతు ఐడీలు పూర్తి!

భారతీయ వ్యవసాయ రంగంలో ఒక చరిత్రాత్మక మైలురాయి నమోదైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అన్నదాతలను ఆర్థికంగా, పారిశ్రామికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ వ్యవసాయ మిషన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. నిర్దేశిత గడువు కంటే ఏకంగా ఐదు నెలలు ముందే ఏకంగా 11 కోట్ల మంది రైతులకు ప్రత్యేక డిజిటల్ ఐడీలను సృష్టించి సరికొత్త రికార్డు సృష్టించింది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం వేగవంతమైంది.

ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆధారిత పాలన అమలవుతోంది. ఇందులో భాగంగా రూపొందించిన 'అగ్రిస్టాక్' వ్యవస్థ ద్వారా రైతు రిజిస్ట్రీ, డిజిటల్ పంట సర్వే, మ్యాపింగ్ ప్రక్రియను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ డిజిటల్ ఐడీ ద్వారా దేశంలోని ప్రతి రైతుకు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలు, సేవలను అర్హులైన రైతులకు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అందించడానికి వీలవుతుంది.

India Reaches Historic Milestone With 11 Crore Farmer IDs Created Under Digital Agriculture Mission Today
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!

ప్రభుత్వ పథకాలు ఇక మరింత సులువు

రైతులకు అందే ప్రభుత్వ సేవలను అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంలో ఈ డిజిటల్ ఐడీ కీలక పాత్ర పోషిస్తోంది. పంటల బీమా, ప్రకృతి విపత్తుల నష్టపరిహారం, ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు, సులభతరమైన బ్యాంకు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల వంటి సేవలు ఇకపై మరింత వేగంగా రైతులకు అందనున్నాయి. ఇప్పటికే ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ఆరు కోట్ల మందికి పైగా రైతులు ప్రత్యక్ష ప్రయోజనాలను పొందడం విశేషం.

రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు, ముహూర్తం ఖరారు- రూ 6 వేలు జమ..!!
రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు, ముహూర్తం ఖరారు- రూ 6 వేలు జమ..!!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు, గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ బృహత్ కార్యం విజయవంతమైంది. కౌలు రైతులు, అసలైన సాగుదారులు కూడా ఈ డిజిటల్ జాబితాలో చోటు దక్కించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాంకేతికతను జోడించడం ద్వారా అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతూ, 'కనీస ప్రభుత్వం - గరిష్ట పాలన' దిశగా భారత్ అడుగులు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+