స్వల్పంగా పెరిగిన కరోనా - 1,217 మంది మృతి : పాజిటివిటీ రేటు 4.54 శాతం..!!
దేశ వ్యాప్తంగా క్రమేణా తగ్గుతూ వస్తున్న కరోనా కేసుల్లో...మరోసారి స్వల్పంగా పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 71,365 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజులోనే 1,217 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 1,72,211మంది వైరస్‌ను జయించారు. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976 గా ఉంది. మొత్తం మరణాలు 5,05,279గా నమోదయ్యాయి.
ఇక.. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 8,92,828 గా ఉండగా.. అదే సమయంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,10,12,869 గా నమోదైంది. దేశంలో కొత్తగా 53,61,099 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,70,87,06,705 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగానూ కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 21 లక్షల మంది కరోనా బారినపడ్డారు. 11,785 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 57,81,546కు చేరింది. జర్మనీలో కొత్తగా 2,12,724 లక్షల మందికి వైరస్ బారినపడ్డారు.

మరో 231 మంది ప్రాణాలు కోల్పాయారు.అమెరికాలో ఒక్కరోజే 1,79,169 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 2,777 మంది మృతి చెందారు.రష్యాలో కొత్తగా 1.65 లక్షల మందికి కరోనా సోకింది. 698 మంది మృతి చెందారు. టర్కీలో తాజాగా 11,1096 కేసులు బయటపడగా.. 241 మంది బలయ్యారు.బ్రెజిల్లో ఒక్కరోజే 1,71,483 మందికి వైరస్ సోకింది. మరో 1,174 మంది మృతి చెందారు. ఇటు..తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
తెలంగాణ ప్రభుత్వం కరోనా పరిస్థితుల పైన కీలక ప్రకటన చేసింది. కరోనా ఆంక్షల ను ఎత్తి వేసింది. థర్డ్ వేవ్ తొలిగిపోయిందని ప్రకటించింది. గతంలో మాదిరిగా అన్నీ యధాతధంగా నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతున్నా... కేసుల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications