నో థర్డ్‌వేవ్: 25 వేలకు కరోనా కొత్త కేసులు: వచ్చే ఏడాది పొడవునా మాస్కులే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. చాలాకాలం తరువాత 30 వేలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. అవి మరింత తగ్గాయి. 25 వేలకు పడిపోయాయి. థర్డ్‌వేవ్ ముప్పు ఇప్పట్లో ఉండకపోవచ్చంటూ నిపుణులు సూచిస్తోన్న నేపథ్యంలో- కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. ఇన్నిరోజులూ కలవరానికి గురి చేసిన కేరళలో కూడా కేసులు తగ్గుతూ వస్తోన్నాయి

దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 25,404 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 339 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 37,127 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579కి చేరింది. ఇందులో 3,24,84,159 మంది కోలుకున్నారు. 4,43,213 మంది వరకు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,62,207గా నమోదైంది.

India reports 25404 new cases, 339 deaths and 37127 recoveries in the last 24 hours

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇప్పటిదాకా 4,42,655 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-6,80,274, బ్రెజిల్-5,87,138 మంది మరణించారు. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలిచింది. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్లను వేసుకున్న వారి సంఖ్య 75 కోట్లను దాటేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది.

ఇప్పటిదాకా 75,22,38,324 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది. సోమవారం ఒక్కరోజే 78,66,950 మంది టీకాలను వేయించుకున్నట్లు పేర్కొంది. కేరళలో కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 15,058 పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. ఇదివరకు ఈ సంఖ్య భారీగా నమోదవుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా 25,404 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 15 వేలకు పైగా ఒక్క కేరళకు చెందినవే.

ఆ తరువాత మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది దీని తీవ్రత. మున్ముందు మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు. కాగా- కరోనా వైరస్ తీవ్రత తగ్గుతున్నప్పటికీ.. మాస్కులను మాత్రం ధరించక తప్పదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు. 2022 సంవత్సరం పొడవునా మాస్కులను ధరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంకో సంవత్సరం పాటు కరోనా వైరస్ పోరాటాన్ని కొనసాగించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+