దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు: కేరళలో తగ్గని ఉధృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అంతకుముందు రోజు కంటే భారీగా కరోనా కేసులు తగ్గాయి. మరణాలు కూడా తక్కువగానే నమోదయ్యాయి. కేసులు 32 వేలకు తగ్గగా, మరణాలు 400కు దిగివచ్చాయి.

భారత్‌లో కొత్తగా 32,937 కరోనా కేసులు, 417 మంది మృతి

భారత్‌లో కొత్తగా 32,937 కరోనా కేసులు, 417 మంది మృతి

గత 24 గంటల వ్యవధిలో దేశంలో 11,81,212 నమూనాలను పరీక్షించగా.. 32,937 మందికి కరోనా సోకినట్లు తేలింది. ముందు రోజు కంటే 8.7 శాతం మేర కేసులు తగ్గాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.22 కోట్లకు చేరాయి. ఇక ఆదివారం 417 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4,31,642కు చేరింది. అయితే, కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గడం కూడా కొత్త కేసుల తగ్గుముఖానికి ఓ కారణంగా తెలుస్తోంది.

దేశంలో 3.8 లక్షలకు కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో 3.8 లక్షలకు కరోనా యాక్టివ్ కేసులు

గత 24 గంటల వ్యవధిలో కరోనా నుంచి 35,909 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనావైరస్ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.14 కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.48 శాతానికి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 3,81,947 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.19 శాతానికి తగ్గింది. ఆదివారం సెలవు రోజు కావడంతో వ్యాక్సినేషన్ కొద్దిగా నెమ్మదించినట్లు తెలుస్తోంది. ఆదివారం 17,43,114 మందికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 54.58,57,108కు చేరింది. మహారాష్ట్రతోపాటు చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా, కేరళ రాష్ట్రంలో మాత్రం మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. దేశంలో కొత్త నమోదవుతున్న కేసుల్లో సగం కేరళ నుంచే ఉండటం గమనార్హం.

కేరళలో తగ్గని కరోనా ఉధృతి

కేరళలో తగ్గని కరోనా ఉధృతి

కేరళలో ఆదివారం 18,582 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36.69 లక్షలకు చేరింది. తాజాగా, 102 మంది మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 18,601కి పెరిగింది. రాస్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా పది శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు, ఏపీలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 16 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,93,697కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 13,647కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,865 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1835 మంది కరోనా నుంచి కోలుకోగా... ఇప్పటివరకూ మొత్తం 19,59,290 మంది కరోనా నుంచి కోలుకున్నారు.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 219 కేసులు, చిత్తూరులో 217, నెల్లూరులో 181 కేసులు అత్యల్పంగా కర్నూలులో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.కోవిడ్ కారణంగా తాజాగా సంభవించిన మరణాల్లో చిత్తూరులో నలుగురు,కృష్ణా జిల్లాలో నలుగురు,తూర్పు గోదావరిలో ఇద్దరు,విశాఖపట్నంలో ఇద్దరు,గుంటూరు,నెల్లూరు,శ్రీకాకుళం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 65,500 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఇప్పటివరకూ 2,456,61,449 శాంపిల్స్‌ను పరీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+