గణనీయంగా తగ్గిన కరోనాకేసులు; భారీగానే మరణాలు: తాజా కేసుల స్థితి ఇదే

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో దేశం 67,597 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. భారతదేశ రోజువారీ కోవిడ్ -19 సంఖ్య మంగళవారం నాడు గణనీయంగా తగ్గటం చాలా ఊరటనిచ్చింది. అయితే మరణాల సంఖ్య మాత్రం 1000 దాటి నమోదవుతున్న పరిస్థితి ఉంది. గత 24 గంటల్లో కరోనా సంబంధిత మరణాల సంఖ్య 1,188 గా నమోదైంది.దీంతో మరణాల సంఖ్య మొత్తంగా 5,04,062కి చేరుకుందని మంత్రిత్వ శాఖ తన రోజువారీ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

5.02శాతానికి తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు

5.02శాతానికి తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు

మంగళవారం నాటి తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,23,39,611కి చేరుకుందని మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. కేసులు క్రమంగా పడిపోవడంతో, పాజిటివిటీ రేటు 5.02 శాతానికి తగ్గింది. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఇది సోమవారం 7.25 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 8.30 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య పది లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,94,891 వద్ద ఉంది.

కరోనా యాక్టివ్ కేసులు 2.35 శాతం

కరోనా యాక్టివ్ కేసులు 2.35 శాతం

మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 2.35 శాతం ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.46 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినుండి 4,08,40,658 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 1,80,456 రికవరీలు జరిగాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావంతో, భారతదేశం ఈ సంవత్సరం ప్రారంభంలో రోజువారీ కోవిడ్-19 కేసులలో విపరీతమైన పెరుగుదలను నమోదు చేసింది. ఇక మునుపటి రోజు 83,876 కేసులు నమోదవడంతో సోమవారం నాడు ఇది 1 లక్ష కంటే దిగువకు పడిపోయింది. గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో, ఈ సంఖ్య 3 లక్షల మార్క్‌కు చేరుకుంది.

అదుపులోకి వస్తున్న కరోనా కేసులు.. 170 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ

అదుపులోకి వస్తున్న కరోనా కేసులు.. 170 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ

గత సంవత్సరం కరోనా మహమ్మారి యొక్క రెండవ వేవ్ సమయంలో, ఇది గరిష్ట సమయంలో 4 లక్షల మార్కును దాటింది. కానీ ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది పరిస్థితి అటు ప్రభుత్వాలకు , ఇటు ప్రజలకు బిగ్ రిలీఫ్ నిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తో మూడో వేవ్ ఒక్కసారిగా పెరిగి క్రమంగా అదుపులోకి వస్తుంది. ఇదిలా ఉంటే భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 170 కోట్లు పంపిణీ చేసినట్లుగా కేంద్రం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 55.7 లక్షల మంది కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+