బాహుబలికి కట్టప్ప.. భారత్ కు రష్యా.. అమెరికా, చైనాకు చావు దెబ్బే..!

ప్రపంచ దేశాల్లో భారత్ కు చిరకాల మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది రష్యానే.. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలమైనవి.. నమ్మకమైనవిగా ఉంటూ వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని Special and Privileged Strategic Partnership అని పిలుస్తుంటారు. భారత్ కు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించే దేశం రష్యా.. భారత్ కు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యా ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో రష్యా కు చెందిన ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తో భారత్ ఈ ఆపరేషన్ ను దిగ్విజయంగా పూర్తి చేసింది. పాకిస్థాన్ సంధించిన వందలాది డ్రోన్ లను ఎస్-400 వ్యవస్థ సులభంగా కూల్చివేసింది. దాంతో ఆపరేషన్ సింధూర్ లో భారత్ విజయం సాధించింది.

ఇక అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఆంక్షలు విధించినా భారత్ మాత్రం రష్యాతో మైత్రిని కొనసాగిస్తూనే వచ్చింది. తాజాగా ఇరు దేశాల మధ్య మరో బిగ్ డిఫెన్స్ డీల్ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్, రష్యా దేశాలు ఒకరి భూభాగంలో మరొకరు తమ సైన్యాన్ని మోహరించుకోవచ్చు. ఈ విధానాన్ని రెసిప్రోకల్ ఎక్స్ ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని అంటారు. తాజాగా ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఇది అమల్లోకి వచ్చింది.

భారత్- రష్యా మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు గరిష్టంగా తమ తమ భూభాగాల్లో 3 వేల మంది వరకు సైనికులను మోహరించుకోవచ్చు. అలాగే 10 యుద్ధ విమానాలను రంగంలోకి దింపే అవకాశం ఉంది. వీటితో పాటు 5 యుద్ధ నౌకలను కూడా మోహరించుకోవచ్చు. ఇక ఈ ఒప్పందం 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇరు దేశాల ఏకాభిప్రాయం ప్రకారం పొడిగించుకోవచ్చు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ డీల్ ప్రకారం భారత్, రష్యా నౌకలకు పోర్టు సేవలు, మరమ్మతులు, సిబ్బందికి ఆహారం, నీటిసరఫరా లభించనున్నాయి.

ఇక రష్యాలోని కీలక ప్రాంతమైన ఆర్కిటిక్ లో భారత సైనిక స్థావరాలకు ప్రవేశం లభించనుంది. దాంతో పరిశోధనలకు కీలకంగా మారిన ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ తన ప్రభావాన్ని పెంచుకునే వీలుంది. ఇది చైనాకు మింగుడుపడని అంశంగా భావించవచ్చు. ఇక భారత్ కు చైనాతో సరిహద్దు వివాదం ఉన్న విషయం తెలిసిందే.

india Russia Defence Pact Mutual Deployment of 3 000 Troops10 Combat Aircraft 5 Warships Permitted

ఈ సమయంలో భారత్ కు రష్యా మద్దతు.. చైనాకు షాక్ అని చెప్పొచ్చు. అలాగే ఉక్రెయిన్ తో యుద్ధం అనంతరం రష్యాను ఒంటరి చేయాలని భావించిన అమెరికాకు భారత్- రష్యా మధ్య ఒప్పందం షాక్ ను కలిగించింది. ఇది భారత్- అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+