పాకిస్థాన్ పై దాడికి బ్రహ్మోస్ భారీ క్షిపణులు రెడీ !
న్యూఢిల్లీ: భారత్, రష్యా రక్షణ రంగంలో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు కలిసి ప్రమాదకరమైన క్షిపణులను సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. పాక్ పై దాడి చేయడానికి అవసరమైన 600 కిలోమీటర్ల ఫ్లస్ రేంజ్ లోని తర్వాతి తరం బ్రహ్మోస్ భారీ క్షిపణులను భారత్ రష్యా సహకారంతో సిద్దం చేస్తోంది.
ఈ ఒప్పందాలకు గోవాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు వేదిక అయ్యింది. న్యూఢిల్లీ, మాస్కో ఇరు నగరాలు సంయుక్తంగా తర్వాతి తరం బ్రహ్మోస్ భారీ క్షిపణులు తయారు చేస్తున్నాయి. కచ్చితమైన టార్గెట్ లో ఈ బ్రహ్మోస్ భారీ క్షిపణులు దాడి చేయనున్నాయి.
శత్రుదేశం అయిన పాకిస్థాన్ లోని ఏ ప్రాంతంలోనైనా దాడి చేసే శక్తి ప్రస్తుతం తయారు చేస్తున్న తర్వాతి తరం బ్రహ్మోస్ భారీ క్షిపణులకు ఉంటుంది. ప్రస్తుతం రూపొందుతున్న బ్రహ్మోస్ క్షిపణులకు 300 కిలోమీటర్ల రేంజ్ లో దాడి చేసే సామర్థ్యం ఉంది.

పాకిస్థాన్ లోపలికి చొచ్చుకుని వెళ్లి లక్షిత దాడులు చేయడానికి ఇవి కొంచెం కష్టతరం అవుతున్నాయి. దీంతో తర్వాతి తరం బ్రహ్మోస్ క్షిపణలు తయారు చేయ్యడానికి భారత్ సిద్దం అయ్యింది.
తర్వాతి తరం బ్రహ్మోస్ క్షిపణులతో పోలిస్తే ఎక్కువ రేంజ్ లోని బాలిస్టిక్ క్షిపణులను భారత్ ఇప్పటికే కలిగిఉంది. అయితే బ్రహ్మోస్ క్షిపణులు మాత్రమే నిర్దేశిత లక్షాలను టార్గెట్ చేసుకుని కూల్చేయగలవు.
2016 జూన్ లో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లో న్యూఢిల్లీ భాగం అయ్యింది. ఎంటీసీఆర్ లో భాగమైన తరువాత భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా తయారు చేసే అతి పెద్ద బ్రహ్మోస్ క్షిపణి ఇదే.
పర్వత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగలిగే శక్తి బ్రహ్మోస్ కు ఉంటుంది. గోవాలో జరిగిన ద్వైపాక్షిక సమిట్ లో భారత్, రష్యా దేశాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందాలు జరిగాయని తెలిసింది.
ఈ ఒప్పందాలపై ఇరు దేశాలు క్షిపణుల భారీ డీల్స్ కుదుర్చుకున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణులను మరింత అభివృద్ది చేస్తామని పుతిన్ వివరించారు.
ఐదో తరం ఎయిర్ క్రాఫ్ట్ ల తయారీకి ఇరు దేశాలు కలసి పనిచేస్తాయని పుతిన్ తెలిపారు. ఈ డీల్స్ తో పాక్ గజగజ వనికిపోతోంది. ఉగ్రవాదాన్ని ఎరివేసేందుకు యుద్దానికి అయినా మేము సిద్దమే అని భారత్ హెచ్చరికలు జారీ చేసింది. ఊరీ ఉగ్రదాడి తరువాత పాక్ కు భారత్ గట్టిగానే జవాబు ఇస్తోంది.












Click it and Unblock the Notifications