వారి కోసం..: క్యాబ్ డ్రైవింగ్ సీట్లో ఎల్జీబీటీ (వీడియో)
ముంబై: రేడియా క్యాబ్ దేశంలోనే తొలిసారిగా ఎల్జీబీటీ వర్గం కోసం బుధవారం ముంబైలో క్యాబ్ సేవలను ప్రారంభించింది. ఈ సందర్భంగా డ్రైవర్ సీటులో కూర్చొని లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.
ఎల్జీబీటీలు కూడా సొంత కాళ్ల పైన నిలబడేందుకు రేడియో క్యాబ్ సర్వీస్ 'వింగ్స్ రెయిన్ బో' పేరుతో దీనిని బుధవారం నాడు ప్రారంభించింది. ఈ క్యాబ్ సర్వీస్‌లను హమ్ సఫర్ ట్రస్ట్, వింగ్స్ ట్రావెల్‌లు సంయుక్తంగా ప్రారంభించాయి.

ఎల్జీబీటీ లేదా ట్రాన్సుజెండర్స్ సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా దాదాపు ఎవరూ సుముఖత చూపరు. దీంతో వారు పొట్ట కూటి కోసం వివిధ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఎల్జీబీటీ, ట్రాన్సుజెండర్లు క్యాబ్ డ్రైవర్‌గా చేయడం దేశంలో దాదాపు ఇదే ప్రథమం.












Click it and Unblock the Notifications