ఆకాశంలో ‘ఆరో కన్ను’.. అదిరిపోయే నాణ్యతతో చిత్రాలు!

భారత్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన కార్టోశాట్‌-2 ఉపగ్రహం తన పని ప్రారంభించింది.

న్యూఢిల్లీ: భారత్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన కార్టోశాట్‌-2 ఉపగ్రహం తన పని ప్రారంభించింది. ఈ ఉపగ్రహాన్ని భారత్‌కు ఆకాశంలో ఆరో నేత్రంగా అభివర్ణిస్తున్నారు.

ఈ శాటిలైట్‌ జులై 26న అంతరిక్షం నుంచి భారత్‌తో పాటు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల ఛాయాచిత్రాలను అద్భుతమైన క్లారిటీతో తీసి పంపింది. వీటిని ఇస్రో ఇవాళ విడుదల చేసింది.

ఈ ఛాయాచిత్రాల్లో.. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌లో ఉన్న కొత్త రైల్వే స్టేషన్‌, ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా పట్టణం, ఖతార్‌లోని దోహాకు సంబంధించినవి ఉన్నాయి. గతంలో ప్రయోగించిన ఉపగ్రహాల మాదిరిగానే ఈ కార్టోశాట్‌-2 కూడా రిమోట్‌ సెన్సింగ్‌ విధానంలో నే పనిచేస్తుంది.

మరిన్ని ఛాయాచిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గగనతలం నుంచి అత్యధిక నాణ్యతతో కూడిన చిత్రాలను తీసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. సైన్యం, వివిధ నిర్మాణాల ప్రణాళిక కోసం ఈ ఉపగ్రహాన్ని వినియోగించనున్నారు. కార్టోశాట్-2 పంపిన చిత్రాల్లో కొన్నింటిని ఎంపిక చేసి ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. వాటిని మీరూ చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+