ఆధార్ గోప్యతపై ఎడ్వర్డ్ స్నోడెన్ సంచలన వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇప్పటికే ఆధార్ అనుసంధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆధార్‌ గోప్యతపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రహస్యాలను బయటపెట్టిన ఎడ్వర్ట్ స్నోడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును ఎడ్వర్డ్ స్నోడెన్ బయటపెట్టిన విషయం తెలిసిందే.

కాగా, వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్‌ చేయడం చాలా సులువని శుక్రవారం స్నోడెన్ వెల్లడించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ స్పష్టం చేస్తున్నప్పటికీ తాజాగా స్నోడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించకున్నాయి.

చాలా ఈజీ అంటూ..

చాలా ఈజీ అంటూ..

భారతదేశం పరిచయం చేసిన ఆధార్‌ డేటాబేస్‌ అక్రమ వినియోగానికి(మిస్‌ యూజ్‌, అబ్యూజ్‌) సులభంగా గురికావచ్చని అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ ఉద్యోగి , విజిల్‌ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించారు. ప్రజల డేటాను సురక్షితంగా ఉంచామని ప్రభుత్వాలు చెబుతుంటాయి, కానీ ఆ డేటాహ్యాకింగ్‌కు గురి కావడం సాధారణ విషయమే అన్నారు.

చరిత్ర చెబుతోందదే..

చరిత్ర చెబుతోందదే..

చట్టాలు ఉన్నా, దుర్వినియోగాన్ని ఆపలేకపోయిందని చర్రిత చెబుతోందని స్నోడెన్ అన్నారు. భారతదేశంలో ఆధార్ డాటాబేస్ ఉల్లంఘనపై సీబీఎస్‌ ప్రతినిధి జాక్ విట్టేకర్ వ్యాఖ్యలకు స్నోడెన్ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. వ్యక్తిగత జీవితాల సంపూర్ణ రికార్డులను తెలుసుకోవడం ప్రభుత్వాల సహజ ధోరణి అని వ్యాఖ్యానించారు.

రూ.500కే ఆధార్ వివరాలు

రూ.500కే ఆధార్ వివరాలు

ఇటీవల ఆధార్‌ డేటా సెక్యూరిటీ దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలతో ఆధార్‌ డేటా గోప్యత చర్చనీయాంశమైంది. దీనిపై సుప్రీంకోర్టులో నిర్ణయం కూడా పెండింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండగానే కేవలం రూ.500 లకే ఆధార్‌ కార్డు వివరాలు లభ్యం అంటూ వచ్చిన నివేదికలు ఆందోళన కలిగించే అంశాలుగా మారాయి.

ఖండించిన యూఐడీఏఐ

ఖండించిన యూఐడీఏఐ

ఇటీవల ట్రిబ్యూన్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో చాలా సులువుగా ఆధార్ డేటా వచ్చేస్తుందని ఆ పత్రిక బుధవారం ఒక కథనంలో పేర్కొంది. దీన్ని ప్రభుత్వం, యూఐడీఏఐ తీవ్రంగా ఖండించింది. ఆధార్ సమాచారం గోప్యంగా ఉందని, ఎలాంటి సమాచారం బహిర్గతం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after the Unique Identification Authority of India (UIDAI) denied that there was any breach of the Aadhaar database, American whistleblower Edward Snowden said on Friday that the Aadhaar database conceived and introduced by the Indian government can also be misused and abused.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి