కరోనా కేసుల్లో రెండో స్థానంలో.. మరణాల్లో మూడో ప్లేస్‌లో: భారత్‌లో వైరస్ విలయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. రికార్డుస్థాయిలో 90 వేలకు పైగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా అదే తీవ్రత మళ్లీ కనిపించింది. కరోనా మరణాల్లోనూ అదే స్థాయిలో ఉధృతి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో ఇప్పటికే భారత్ రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్‌ను మూడోస్థానంలోకి నెట్టేసింది. అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. కరోనా వైరస్ రోజువారీ కేసుల్లో ఇప్పుడు కనిపిస్తోన్న వేగం.. ఇదే స్థాయిలో కొనసాగితే.. టాప్ ప్లేస్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1115 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 43,70,129కి చేరుకుంది. ఇప్పటిదాకా 73,890 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,97,394కు చేరుకుంది. 33,98,845 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్‌ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. అమెరికా ప్రస్తుతం 65,14,231 కేసులతో అగ్రస్థానంలో ఉంది.

Indias COVID19 case tally crosses 43 lakh mark with a spike of 89706 new cases

కరోనా మరణాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో కొనసాగుతోంది. 73,890 మంది ఇప్పటిదాకా మరణించారు. అమెరికా, బ్రెజిల్ తరువాత అత్యధిక మరణాలు నమోదైనది భారత్‌లోనే. అమెరికాలో 1,94,032, బ్రెజిల్‌లో 1,27,517 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. భారత్‌లో ఇదివరకు వెయ్యికి లోపే కరోనా మరణాలు నమోదువుతోండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 1100లను దాటుకుంది. మరింత పెరుగుతోంది. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోందని అధికారులు చెబుతున్నారు.

దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి సోమవారం వరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య అయిదు కోట్ల మార్క్‌ను అధిగమించింది. ఇప్పటిదాకా 5,18,04,677 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజులో 11,54,549 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+