Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో ఘోరం: 6నెలల శిశువుపై అత్యాచారం, హత్య

ఇండోర్‌: గత కొంత కాలంగా చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలు ఆందోళననకు గురిచేస్తున్నాయి. మానవ మృగాల చేతుల్లో అభం శుభం తెలియని ఎందరో చిన్నారులు బలవుతున్నారు. పసిప్రాయంలోనే కామాంధుల చెర చిక్కి అసువులు బాస్తున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. తల్లి పక్కనే నిద్రిస్తున్న ఆరు నెలల పసికందును ఎత్తుకెళ్లిన ఓ దుర్మార్గుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని చంపేశాడు. ఇండోర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

India’s daughters under attack: Now, six-month-old baby girl raped, killed in MP’s Indore

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ నగరంలోని రాజ్‌వాడా ఫోర్ట్‌ సమీపంలో గల ఓ భవనం బేస్‌మెంట్‌లో రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులు బేస్‌మెంట్‌లో ఉన్న సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. అందులో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి సదరు చిన్నారిని భుజాన ఎత్తుకొని బేస్‌మెంట్‌కు తీసుకొచ్చినట్లు ఉంది. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరిపారు.

రాజ్‌వాడా ఫోర్ట్‌ సమీపంలో ఓ కుటుంబం బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. వారికి ఆరు నెలల కుమార్తె ఉంది. గురువారం రాత్రి వారంతా ఫోర్ట్‌ ముందు నిద్రిస్తుండగా సునిల్‌ భీల్‌ అనే వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. సమీపంలోని ఓ భవనం బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేశాడు.

శుక్రవారం మధ్యాహ్నం బేస్‌మెంట్‌లో దుకాణం తెరవడానికి వచ్చిన ఓ వ్యక్తి రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారిని చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+