దేవుడా.. 7 చోట్ల తొక్కిసలాట.. 184 మంది మృతి.. ఏం జరుగుతోంది..?

ఆర్సీబీ ఐపీఎల్-2025 టైటిల్ గెలుచుకున్న సందర్భంగా కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన RCB విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. అయితే గతేడాది నుంచి దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఓసారి పరిశీలిస్తే.. రానురాను ఈ ఘటనలు అధికంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ముందస్తు చర్యలు, భద్రతా లోపం కారణంగానే ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2024 జులైలో ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ భోలే బాబా సత్సంగ్ కార్యాక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2024 డిసెంబర్ లో పుష్ప-2 ప్రీమియర్ షో వేళ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఏడాది జనవరిలో తిరుమల తిరుపతిలో టోకెన్ల జారీ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు.

మహాకుంభ మేళా సందర్భంగా జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలో 60 మందికి పైగా గాయపడ్డారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో రాగా తొక్కిసలాట జరిగింది.

అంతేకాక 2025 ఫిబ్రవరి 15న న్యూ దిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలు సీట్లకోసం యత్నించగా ఈ విషాదం జరిగింది. ఇటీవల మే 3, 2025న గోవాలోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు.

India s Deadly Stampedes Over 180 Lives Lost Since 2024 Urgent Calls for Crowd Control

గతేడాదితో పోల్చితే 2025 లో నెలకోసారి ఇలాంటి తొక్కిసలాట ఘటనలు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. క్రౌడ్ మేనేజ్ మెంట్ పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనాలు అధిక సంఖ్యలో గుమిగూడిన చోటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+