సంచలనం: వేతనాలు తగ్గించుకోండి.. లేదంటే ఇంటికే: ఉద్యోగులకు జెట్ ఎయిర్ వేస్ లేఖ
దేశీయ రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 30-35 శాతం వేతనాలను తగ్గించుకోవాలని, లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లాలని ఈ ఎయిర్‌లైన్స్ జూనియర్ ర్యాంకింగ్ పైల
న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 30-35 శాతం వేతనాలను తగ్గించుకోవాలని, లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లాలని ఈ ఎయిర్‌లైన్స్ జూనియర్ ర్యాంకింగ్ పైలెట్లను ఆదేశిస్తోంది.
ఒకవైపు ఇండిగో, స్పైస్ సెట్ విమానయాన సంస్థల నుంచి తీవ్ర పోటీ, మరోవైపు గల్ఫ్ ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో జెట్ ఎయిర్‌వేస్ ఆదాయం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు వేతన కోత చేపడుతోంది.

వ్యయాల కోతలో భాగంగా జెట్ ఎయిర్‌వేస్ ఈ ఆదేశాలు జారీచేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ నెల మొదట్లోనే ప్రతిపాదిత జీతం, వేతనాల కోతకు సంబంధించి ఆదేశాలు జారీచేస్తూ పైలెట్లకు లేఖలు రాసిందని తెలిసింది.
ఎక్కువగా నౌకాశ్రయం కార్యకలాపాలపై దృష్టిపెట్టడం, తమ నెట్‌వర్క్‌ను హేతుబద్దీకరణ చేసుకోవడం మూలాన జెట్ ఎయిర్‌వేస్ ఇలాంటి చర్యలను తీసుకుంటుందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
ఆగస్టు నుంచి వేతన కోత ప్రతిపాదనలు అమల్లోకి రాబోతున్నాయని, ఎయిర్‌లైన్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 400 మంది పైలెట్లు వరకు ప్రభావితం కాబోతున్నారని తెలిసింది.
జెట్ ఎయిర్‌వేస్ పాక్షికంగా యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు చెందినది. ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో జెట్ ఎయిర్‌వేస్ తలకుమించిన వ్యయాలతో సతమతమవుతోంది.
మరోవైపు తక్కువ ధరల క్యారియర్స్ ఇండిగో, స్పైస్‌జెట్ నుంచి విపరీతమైన పోటీ నెలకొంటోంది. ఆయిల్ రిచ్ గల్ఫ్ ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications