మన దేశం మన యాప్: డైలీ హంట్ నుంచి వీడియో యాప్ జోష్..సెప్టెంబర్ 9న ఆవిష్కరణ..

ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రముఖ న్యూస్ యాప్ డైలీ హంట్ సరికొత్త షార్ట్ వీడియో యాప్‌ను తీసుకొస్తోంది. ఈ యాప్‌ పేరు జోష్. ఈ వీడియో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం 9 సెప్టెంబర్ 2020న మధ్యాహ్నం 1 గంటకు జరగనుంది. ఇప్పటి వరకు పలు విదేశీ వీడియో యాప్‌లకే ఎక్కువ క్రేజ్ ఉండేది. కానీ డైలీ హంట్ తీసుకొస్తున్న స్వదేశీ యాప్‌ జోష్‌ 10 భారతీయ భాషల్లో వస్తోంది. ఈ యాప్‌ను నేరుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రారంభానికి ముందే ఈ జోష్ యాప్ సంచలనాలు క్రియేట్ చేస్తోంది.

సెన్సార్ టవర్ డేటా ప్రకారం గూగుల్ ప్లే స్టోర్‌లో జోష్ యాప్ టాప్ ప్లేస్‌లో ఉంది. పలు వీడియో యాప్‌లను వెనక్కు నెట్టేసి జోష్ ముందు వరసలో దూసుకెళుతోంది. జోష్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకుని మీ టాలెంట్‌ను ఒక చిన్న వీడియో ద్వారా పోస్టు చేయండి. ప్రపంచానికి మీ టాలెంట్‌ను చూపండి. ఏమో ఎవరికి తెలుసు... మీరు చేసే వీడియో జోష్‌లో క్లిక్ అయితే మీరు కూడా ఒక సెలబ్రిటీగా మారొచ్చేమో. ఇప్పటి వరకు డైలీ హంట్ న్యూస్ యాప్ ప్రపంచం నలుమూలల జరిగే వార్తలను మీకు అందిస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు జోష్ యాప్‌ను తీసుకొస్తోంది. సృజనాత్మకత, వైవిధ్యాలను మేళవింపు చేసి భారతీయులకు అందించాలనే ఉద్దేశంతో డైలీ హంట్ ఈ గొప్పదేశానికి జోష్‌ యాప్‌ను అంకితం చేస్తోంది.

Indias leading news app Daily Hunt to launch short video Josh App on September 9th

ఇంకెందుకు ఆలస్యం జోష్ యాప్ లైవ్‌లో మీరు కూడా పాల్గొనండి వీక్షించండి. బుధవారం రోజున గ్రాండ్ లాంచ్‌ను మీరు కూడా వీక్షించొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఇన్స్‌టాగ్రామ్‌ లేదా ఫేస్‌బుక్ లేదా యూట్యూబ్‌కు లాగిన్ అయి ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించండి. విదేశీ యాప్‌లకు గుడ్ బై చెప్పేద్దాం... జోష్ యాప్‌కు వెల్కమ్ పలుకుదాం. భారతీయుల కోసం భారత్‌లో భారతీయులు తయారు చేసిన జోష్ యాప్‌ను ఆదరిద్దాం.. ఫుల్ జోష్‌తో ఆహ్వానిద్దాం. లైవ్ కార్యక్రమం వీక్షించేందుకు కింద లింకులపై క్లిక్ చేయండి:

Instagram-
https://instagram.com/officialjoshapp?igshid=n6jq3xgghnag

Facebook-
https://www.facebook.com/Officialjoshapp

Youtube-

https://www.youtube.com/channel/UCwh0CXZfDNRGCoFdjFMvt9w

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+