Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"యంగ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్" టైటిల్ విజేతల వీరే: మృదంగంలో విజేతగా కృష్ణా జిల్లా వాసి..!

"యంగ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్" టైటిల్ కోసం పోటీపడిన వారినుంచి విజేతల జాబితాను SIFF యంగ్ ఆర్టిస్ట్ 2021 సెప్టెంబర్ 4వ తేదీన ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా జరిగిన ఓ కార్యక్రమంలో విజేతల పేర్లను ప్రకటించడం జరిగింది. గిటార్ ఇన్స్‌ట్రుమెంటల్‌ విభాగంలో తమిష్ పులప్పాడి, ఇండియన్ వోకల్ విభాగం నుంచి వోకల్‌లో అక్షిత సింగ్ చౌహాన్, భరతనాట్యం విభాగంలో జానకి డీవీలు విజేతలుగా నిలిచారు. విజేతలకు రూ.లక్ష క్యాష్ ప్రైజ్‌గా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీతం నృత్య రంగాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఎల్. సుబ్రహ్మణ్యం, నిఖితా గాంధీ, ఎహెసాన్ నూరాణీ, షాల్మలీ కోల్గడే, టెరెన్స్ లూయిస్, షోవనా నారాయణ్, బ్లాక్ ఐస్ క్రూ‌ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంకు హోస్ట్‌గా ఆదిత్య నారాయణ్ వ్యవహరించారు. పీపుల్స్ చాయిస్ ఓటింగ్ ప్లాట్‌ఫాంపై మొత్తంగా 22వేల ఓట్లు వచ్చాయి. ఇందులో డ్రమ్స్ కేటగిరీ నుంచి ఆత్మిక్ గుప్తా విజేతగా నిలువగా అతనికి రూ.50వేలు క్యాష్ ప్రైజ్ అందజేయడం జరిగింది.

India’s top budding talent across art forms awarded the first title of “Young Artiste of the Year”

" టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి నైపుణ్యతను దాచకుండా ప్రదర్శించేందుకు చక్కటి వేదిక కల్పించాలన్న ఉద్దేశంతో సిఫ్ యంగ్ ఆర్టిస్ట్ విజయవంతంగా పనిచేసింది. ఆయా రంగాల్లో చక్కటి ప్రతిభ ఉన్నవారికోసం ఇది మంచి వేదికగా నిలిచింది. తాము తీసుకువచ్చిన వేదిక ద్వారా పోటీదారులు తమ నైపుణ్యతను ప్రదర్శించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రాండ్ ఫినాలేలో ప్రతి ఒక్క పోటీదారుడు అత్యుత్తమమైన ప్రదర్శన కనబర్చారు" అని సిఫ్ యంగ్ ఆర్టిస్ట్ 2020 సహవ్యవస్థాపకురాలు కవిత అయ్యర్ చెప్పారు.

గ్రాండ్ ఫినాలేలో మ్యూజిక్ మరియు డాన్స్ విభాగాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క పోటీదారుడికి రూ. 25,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో విజేతలు కేటగిరీ వారీగా ఇలా ఉంది:
భరతనాట్యం: జానకి డీవీ, ఉడిపి, కర్నాటక

బాలీవుడ్: మాన్సీ ధృవ్ , రాజ్‌కోట్ , గుజరాత్

కర్నాటిక్ వయోలిన్: పీఎస్ నరేంద్రన్, అలపుజా, కేరళ

కాంటెంపొరరీ: విశాల్ కుమార్ యాదవ్, డార్జీలింగ్ , పశ్చిమ బెంగాల్

డ్రమ్స్: టీఆర్ నిఖిల్, చెన్నై, తమిళనాడు

ఫ్లూట్ : మోహన్ కృషణ్, ఫరీదాబాద్, హర్యానా

గిటార్: తమిష్ పులప్పాడి, బెంగళూరు , కర్నాటక

హిందుస్తానీ వోకల్: శ్రేయా వీ మూర్తి, బెంగళూరు, కర్నాటక

హిప్‌హాప్: అమన్ జైస్వాల్, పాట్నా, బీహార్

ఇండియన్ వోకల్: అక్షిత సింగ్ చౌహాన్, ఉజ్జైన్, మధ్య ప్రదేశ్

కథక్: అనన్య గౌర్, ఉజ్జైన్, మధ్య ప్రదేశ్

మృదంగం: కేపీఎస్ కార్తికేయ ఆదినారాయణ శర్మ, కృష్ణ ఆంధ్రప్రదేశ్

ఒడిస్సీ: మేఘనా మిశ్రా , రూర్కేలా, ఒడిషా

పియానో / కీబోర్డు: సాత్విక్ ఆర్ భరద్వాజ్, హస్సన్, కర్నాటక

సితార్/సరోద్: అరోన్య నందన్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్

తబలా: ఉజిత్ ఉదయ కుమార్, న్యూఢిల్లీ, ఢిల్లీ

వెస్ట్రన్ వయోలిన్: అంథియా దియాస్, మార్గావ్ సల్సీట్, గోవా

వెస్ట్రన్ వోకల్ : దైసువాంగ్లాంగ్ కామే, ఇంఫాల్ ఈస్ట్ , మణిపూర్

దేశం నలుమూలల నుంచి 12వేల అప్లికేషన్లు రాగా ఇందులో నుంచి టాప్ 100 మందిని ఫైనల్స్‌కు పంపడం జరిగింది. ఫైనలిస్టులు కనబర్చిన ప్రదర్శనను ఆయా రంగాల్లో నిష్ణాతులైన జడ్జీలు క్షుణ్ణంగా పరిశీలించారు. విజేతలకే కాకుండా ఇతర ఫైనలిస్టులకు కూడా రూ.10వేలు క్యాష్ ప్రైజ్‌తో ప్రోత్సహించడం జరిగింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపారు. కేవలం నగరాలు పట్టణాల నుంచే కాదు.. గ్రామీణ స్థాయి నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి.టాప్ 100 విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యతకు మరింత పదను పెట్టడం జరిగింది. ఈ 100 మంది ఫైనలిస్టులకు ప్రముఖులు మెంటార్లుగా వ్యవహరించారు. యంగ్ ఆర్టిస్ట్ అడ్వాన్స్‌డ్‌ మెంటార్షిప్ ప్రోగ్రాం కింద వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దీన్ని సిఫ్ స్పాన్సర్ చేసింది.

SIFF యంగ్ ఆర్టిస్ట్ 2020-21 అనే సంస్థ 2020 జనవరిలో ప్రారంభించబడింది. జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. వారిలోని ప్రతిభను గుర్తించి వారికి అవార్డులు లేదా స్కాలర్షిప్‌ రూపంలో రూ.25 లక్షలు అందజేస్తోంది. 20 వేర్వేరు విభాగాల్లో టాలెంట్ కలిగి ఉన్న విద్యార్థులను గుర్తించడం జరుగుతోంది. తొలి సీజన్‌లో అద్భుతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో రెండవ సీజన్‌ 2022లో ప్రారంభించాలని భావిస్తోంది.

చిన్న పిల్లలకు కౌమార దశలో ఉన్నవారికి మ్యూజిక్ డ్యాన్స్‌లలో ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోంది యంగ్ ఆర్టిస్ట్. బిగినర్స్, ఇంటర్మీడియెట్ మరియు అడ్వాన్స్‌డ్‌ లెవెల్స్ వారికి ఈ కోర్సులను డిజైన్ చేయడం జరిగింది. లైవ్ క్లాసులు, గైడెడ్ ప్రాక్టీస్ సెషన్స్, క్రియేటివ్ అసైన్‌మెంట్స్, బృందాలుగా ఏర్పడి నేర్చుకోవడం, పెర్ఫార్మెన్స్ మరియు మాస్టర్ క్లాసెస్ సర్టిఫికేషన్‌‌లు ఇవ్వడం జరుగుతుంది. యంగ్ ఆర్టిస్ట్ అడ్వయిజరీ ప్యానెల్‌లో మాధవి ముద్గల్, నిఖిత గాంధీ, డాక్టర్ ఎన్‌ రాజాం (బెనారస్ హిందూ యూనివర్శిటీకి లో మాజీ హెచ్ఓడీ, డీన్), జైన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రుద్రపట్నం త్యాగరాజన్, ఐటీసీకి చెందిన సంగీత్ రీసెర్చ్ అకాడెమీలో గురువుగా ఉన్న ఉదయ్ భవాల్కర్‌లు ఉన్నారు. ఇలాంటి మేధావులు ఇక్కడ మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వివరాలకు

Visit: www.youngartiste.com

Facebook: Young Artiste

Instagram: Young Artiste

Twitter: Young Artiste

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+