నాలుగు నెలల్లో గరిష్టం: మరింత పెరిగిన భారత నిరుద్యోగిత శాతం
న్యూఢిల్లీ: భారతదేశంలో నిరుద్యోగిత ఫిబ్రవరిలో 7.7శాతానికి పెరిగింది. గత అక్టోబర్ నుంచి ఇదే అత్యధికం కావడం గమానర్హం. జనవరిలో 7.16శాతంగా నిరుద్యోగిత రేటు ఉంది. ఈ మేరకు వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామి(సీఎంఐఈ) డేటా సోమవారం వెల్లడించింది.
Recommended Video

ఆర్థిక మందగమనం కారణంగా నిరుద్యోగిత శాతం పెరిగిందని సీఎంఐఈ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ గత ఆరేళ్లలో గత మూడు నెలల కాలంలోనే అత్యంత మందగమనాన్ని ఎదుర్కొందని పేర్కొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇతర దేశాలతోపాటు ఆసియాలోనే మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌పై ఉందని తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు జనవరిలో 5.97 శాతం ఉండగా.. ఫిబ్రవరిలో 7.37 శాతానికి పెరిగింది. ఇక పట్టణ ప్రాంతాల్లో జనవరిలో నిరుద్యోగిత శాతం 8.65 శాతం ఉండగా.. ఫిబ్రవరిలో 9.37 శాతానికి పెరిగిందని ఈ ముంబైకి చెందిన ప్రైవేటు అధ్యాయన సంస్థ సీఎంఐఈ వెల్లడించింది.












Click it and Unblock the Notifications