గిన్నిస్ రికార్డు సాధించిన స్వచ్ఛ భారత్ ప్రకటన
రాయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై యువతలో అవగాహన కల్పించేందుకు సిద్ధం చేసిన ప్రకటన.. ప్రపంచంలో అతిపెద్ద ప్రకటనగా రికార్డు సృష్టించింది. ప్రముఖ విద్యావేత్త జవహర్ సూరిశెట్టి సమన్వయంతో మధ్య భారత్‌లో ప్రముఖ సంస్థ అయిన సంతోష్ రంగ్టా గ్రూప్, భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఈ ప్రకటనను రూపొందించాయి.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరవాత పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాన మంత్రులతో కూడిన ఈ ప్రకటన 36,180 చదరపు అడుగుల (180 అడుగుల వెడల్పు, 201 అడుగుల పొడవు) విస్తీర్ణంలో ఉందని గిన్నిస్ మంగళవారం ధ్రువీకరించింది.

ఈ సందర్భంగా జవహర్ సూరిశెట్టి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి యువకుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. అందుకే భారత ప్రధానమంత్రులతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకటన(పోస్టర్)ను తయారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించామని తెలిపారు.
ఈ పోస్టర్ కంటే ముందు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అభిమానుల క్లబ్ ఆధ్వర్యంలో 34,000ఫీట్లతో ‘బాస్' చిత్ర పోస్టర్‌ను యుకెలో విడుదలైంది. దానికంటే ముందు సోనీ మ్యూజిక్ 5000ఫీట్లతో మైకేల్ పేరిట మైకేల్ జాక్సన్ ఆల్బమ్ పోస్టర్‌ను 5000పీట్ల విస్తీర్ణంతో విడుదల చేసింది.












Click it and Unblock the Notifications