పాక్ పెంపుడు పిల్లిలా తోకాడించాలంటే భారత్ ఇలా చేయాలి: సుబ్రహ్మణ్య స్వామి

గతంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వ్యవహార శైలి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగి తనదైన విద్యను ప్రదర్శించి కిమ్‌ను చర్చల వరకు తీసుకురాగలిగారు. ఇదే మంత్రాన్ని భారత్ కూడా అవలంబించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

ఓ శత్రువుని లొంగదీసుకునేందుకు ట్రంప్ వేసిన ఎత్తుగడలు సత్ఫలితాలను ఇచ్చాయని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను కూడా ఇలానే భారత్ ఒప్పించగలిగేలా చొరవతీసుకోవాలని స్వామి అభిప్రాయపడ్డారు.

India Should deal Pak as how trump dealt with Kim tweets swamy

తొలుత పాకిస్తాన్‌కు భయం అంటే ఏమిటో తెలిసేలా చేసి... ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేయగల సత్తా భారత్‌కు ఉందని తెలియజెప్పాలని స్వామి అన్నారు. ఇక రెండో దశలో పాకిస్తాన్‌కు చైనా మద్దతు తెలపకుండా ఉండేలా భారత్ చర్యలు తీసుకోవాలని సూచించారు.

India Should deal Pak as how trump dealt with Kim tweets swamy

ఇలా చేస్తే పెంపుడు పిల్లిలా పాకిస్తాన్ తోకాడిస్తూ భారత్ ముందు కూర్చుంటుందని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. స్వామి చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. స్వామి చేసిన సూచనలను భారత్ పాటించాలని ట్వీట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+