మరో అస్త్రం: జలాంతర్గామి నుంచి పరీక్ష చేసిన అణు క్షిపణి ప్రయోగం విజయవంతం
Recommended Video
విశాఖపట్నం: భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అణు క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఈ కే-4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది డీఆర్‌డీఓ. నేవీకి సేవలందిస్తున్న అణుజలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్‌లో ఈ అణుక్షిపణిని ఉంచుతారు. ఈ అణుక్షిపణి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
ఆదివారం రోజున ఉదయం సముద్ర గర్భం నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను చేధించేలా క్షిపణి ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. అంతేకాదు జలాంతర్గామి నుంచే ఈ క్షిపణిని ప్రయోగించే సత్తా ఉండటంతో అదనపు బలం చేకూరినట్లయ్యిది. భారత్ తయారు చేస్తున్న అరిహంత్ అణు జలాంతర్గాములకు సపోర్ట్ చేసేలా ఈ క్షిపణిని రూపొందించారు. అణుజలాంతర్గాముల్లో మోహరించి ఉండేలా ఈ క్షిపణులు రూపొందిస్తున్నారు. అయితే జలాంతర్గాముల్లో మోహరింపు చేయడానికి ముందు మరికొన్ని ప్రయోగాలను చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఒకే ఒక అణు జలాంతర్గామి భారత నేవీకి సేవలందిస్తోంది.

డీఆర్‌డీఓ రూపొందిస్తున్న సముద్ర గర్భ క్షిపణుల్లో కే-4 ఒకటిగా ఉంది. మరొకటి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల BO-5 క్షిపణి. క్షిపణ ప్రయోగ సమయంలో వాయుసేనకు, మెరైన్ విభాగాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సముద్ర గర్భం నుంచి క్షిపణి ప్రయోగం జరుగుతుందని జలాంతర్గామి పూర్తి స్థాయిలో రూపొందించిన తర్వాత దీనిపై నుంచి ప్రయోగం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంతకుముందు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే 2017 డిసెంబర్‌లో ఏకే-4 ఎస్‌ఎల్‌బీఎం ప్రయోగం విఫలమైంది. బ్యాటరీలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రయోగం నాడు విఫలమైంది. కే-4 శ్రేణికి చెందిన క్షిపణిని చివరిసారిగా ఐఎన్‌ఎస్ అరిహంత్ జలాంతర్గామి నుంచి ఏప్రిల్ 2016లో ప్రయోగించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications