అగ్ని -5: చైనాకు ఇండియా షాక్, అమెరికా సరసన భారత్, ఇక టార్గెట్ ఇదే!
Recommended Video

న్యూఢిల్లీ: అగ్ని -5 క్షిపణిని భారత్ విజయవంతంగా జనవరి 18వ, తేదిన ప్రయోగించింది.ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చైనాలో వనుకు పుడుతోంది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడ ఈ క్షిపణి ధ్వంసం చేసే శక్తి ఉంది. ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్ క్లబ్‌లో ఇండియా చేరింది.
చైనా ఇటీవల కాలంలో ఇండియాను లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతోంది. ఇండియాకు వ్యతిరేకంగా అవకాశాలను వాడుకొంటుంది. అదే సమయంలో పాకిస్థాన్‌కు చైనా అన్ని రకాలుగా సహయ సహకారాలను అందిస్తోంది.
ఇండియా సరిహద్దు వెంట చైనా ఆర్మీ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. సియాచిన్, డోక్లామ్ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి చైనా పూనుకొంది. శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి.

అగ్ని -5 విజయవంతంతో చైనాలో వణుకు
అగ్ని -5 విజయవంతం కావడంతో చైనాలో వణుకు మొదలైందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 18వ, తేదిన ఈ క్షిపణిని చైనా విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడ ఈ క్షిపణి ధ్వంసం చేయనుంది. దీంతో చైనాకు వణుకు మొదలైందని రక్షణ నిపులు అభిప్రాయపడుతున్నారు.

ఆసియాతో పాటు యూరప్ 70 శాతం ఇండియా పరిదిలోకి
ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంతో ఇండియా పరిధిలోకి ఆసియా ఖండం మొత్తం వచ్చింది. యూరప్‌లోని 70 శాతం భూభాగం వచ్చి చేరుతోందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చైనాలోని ఉత్తరప్రాంతం మొత్తం ఇప్పడు భారత్ క్షిపణి పరిధిలోకి వచ్చేస్తోంది.

అమెరికా సరసన చేరిన భారత్
అగ్ని -5 క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాల సరసన ఇండియా చేరిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్ క్లబ్‌లో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే సరసన చేరింది. మొత్తానికి చూస్తే భారత్‌తో పాటు ఇప్పుడు అన్ని దేశాలకూ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణలు ఉన్నట్లే.

అగ్ని-6 పై ఇండియా పరీక్షలు
అగ్ని- 5 సక్సెస్ అవ్వడంతో భారత్ అగ్ని-6పై దృష్టిపెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేగానీ జరిగితే తమ సీఎస్‌ఎస్-10 స్థాయిని అలవోకగా అందుకుంటుందని చైనా తీవ్ర ఆందోళన చెందుతోందని తెలుస్తోంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ టెక్నాలజీపై కూడా దృష్టి పెట్టనుంది. ఒక వేళ ఇదేగానీ వర్కవుట్ అయితే ఒకే క్షిపణితో ఏకాలంలో పలు లక్ష్యాలపై దాడి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!












Click it and Unblock the Notifications