Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒడిశాలో హంగ్ అసెంబ్లీ ! బీజేడీ-బీజేపీకి సమాన సీట్లు ! ఇండియా టుడే యాక్సిస్ పోల్ !

పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో తాజాగా లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో అధికార బీజేడీతో విపక్ష బీజేపీ హోరాహోరా తలపడింది. కాంగ్రెస్ కు అవకాశమివ్వకుండా ఇన్నాళ్లూ రాజకీయాలు చేస్తున్న బీజేడీ, బీజేపీ ఈసారి మాత్రం సీట్ల పంపకాలు కొలిక్కిరాకపోవడంతో విడిగా పోటీ చేశాయి. అయితే ఈ హోరాహోరీ పోరులో లోక్ సభ ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయని, అసెంబ్లీలో మాత్రం హంగ్ తప్పదని ఇండియా టుడే-మై యాక్సెస్ ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది.

ఒడిశాలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఇండియా టుడే-మై యాక్సెస్ ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించింది. ఇందులో ఒడిశాలో ఉన్న 21 లోక్ సభ సీట్లలో బీజేపీకి ఏకంగా 18-20 సీట్లు దక్కుతాయని యాక్సెస్ పోల్ అంచనా వేసింది. అధికార బీజేడీకి మాత్రం కేవలం 0-2 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ కు 0-1 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అనంతరం నిన్న అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ కూడా బయటపెట్టింది.

india today- axis my india exit poll predicts hung in odisha with 62-80 seats to bjp and bjd also

ఒడిశా అసెంబ్లీలో మొత్తం 147 సీట్లు ఉండగా.. ఇందులో బీజేపీ, బీజేడీ ఇద్దరూ కూడా 62 నుంచి 80 సీట్ల మధ్య సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే- మై యాక్సెస్ ఇండియా పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 8 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అధికారం చేపట్టేందుకు ఏ పార్టీకి అయినా కావాల్సిన మ్యాజిక్ మార్కు సీట్లు 74 కాగా.. ఈ ఫిగర్ సాధించడంలో ఏ పార్టీ సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ గా మారొచ్చనే అంచనాలున్నాయి.

యాక్సెస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, బీజేపీ ఓట్ల శాతం 42 శాతానికి పెరిగే అవకాశం ఉంది. బీజేడీ ఓట్ల శాతం కూడా 42కి పడిపోనుంది. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు వస్తాయని యాక్సిస్ అంచనా వేస్తోంది. ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని అంచనా. ఈ ఎగ్జిట్ పోల్ నిజమైతే, 2004 తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో బీజేడీకి పూర్తి మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+