Mood of the Nation..ఏం చెబుతోంది: మోదీ మళ్లీ గద్దెనెక్కుతారా?
న్యూఢిల్లీ: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్-రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి.
వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ అసెంబ్లీ వార్‌ను సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ అయిదు రాష్ట్రాల్లో విజయకేతనాన్ని ఎగురవేయడం ద్వారా సార్వత్రిక ఎన్నికలపై ఆధిపత్యాన్ని కనపర్చాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

ఈ పరిస్థితుల మధ్య ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్‌సభ స్థానాలకు ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. పరిస్థితేమిటనేది ఈ పోల్ స్పష్టం చేసింది. ఎవరు రాజవుతారు? ఎవరు బంటు అవుతారనేది తేల్చి చెప్పింది.
కేంద్రంలో అధికారంలో ఎవరు వస్తారనేది కుండబద్దలు కొట్టింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయనేది వెల్లడించింది. రాష్ట్రాలు, పార్టీల వారీగా మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో ఎవరి జెండా ఎగురుతుందనేది తేల్చేసింది. తాజా రాజకీయాలనూ విశ్లేషించింది.
ప్రధానమంత్రిగా మళ్లీ నరేంద్ర మోదీని మెజారిటీ ప్రజలు కోరుకుంటోన్నారనది ఈ సర్వే తేల్చి చెప్పింది. మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ఈ పరిస్థితుల్లోనూ ఆయనకు ఆదరణ తగ్గలేదని స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది మూడోసారి ప్రధానిగా మోదీ అధికారంలోకి రావాలని కోరుకుంటోన్నట్లు తెలిపింది.

ప్రస్తుత నెలలో నిర్వహించిన సర్వే ఇది. 63 శాతం మంది ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. గతంలో నిర్వహించిన సర్వేతో పోల్చితే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అప్పట్లో 72 శాతం మంది మోదీ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేయగా.. ఇప్పుడా సంఖ్య 63కు పడిపోయింది.
2024 ఎన్నికల్లో మోదీని చూసే బీజేపీకి ఓటు వేస్తామని 44 శాతం మంది అభిప్రాయపడినట్లు మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది. బీజేపీకి ఓటు వేయడానికి గల కారణాలు- అభివృద్ధి, హిందుత్వ కారణాలేనని తేల్చి చెప్పింది ఇండియా టుడే-సీఓటర్ సర్వే. 13 శాతం మంది మోదీ పనితీరుకు యావరేజ్ మార్కులు వేశారు. మరో 22 శాతం మంది ఆయన పనితీరు పేలవంగా ఉందని తేల్చేశారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications