ఆయిర్ రిఫైనరీలపై దాడులు.. తక్షణమే ఆపాలి: భారత్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. 19 రోజులకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య భీకర యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. ఇరాన్​ లోని అణు కేంద్రాలు, గ్యాస్ రిఫైనరీ క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్​ కూడా ఇజ్రాయెల్ తోపాటుగా అమెరికాలోని ఇంధన లక్ష్యాలే కేంద్రంగా దాడులకు పాల్పడుతోంది.

తమ ఎనర్జీ మౌలికసదుపాయాలపై దాడి చేసి శత్రువు పెద్ద తప్పు చేసిందని తాజాగా ఇరాన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. పొరుగు దేశాల ఆయిల్ ఫెసిలిటీస్ పై దాడులు చేయాలని మాకు ఏమాత్రం ఆలోచన లేదు.. అమెరికా, ఇజ్రాయెల్ మాపై దాడికి పాల్పడ్డాయి. ఇప్పుడు యుద్ధం మరోస్థాయికి చేరింది. గల్ఫ్ దేశాల ఎనర్జీ ఫెసిలిటీస్ పై దాడులను ప్రారంభించాం.. మరోసారి మాపై అటాక్ చేస్తే వాటిని పూర్తిగా నాశనం చేస్తామని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

అయితే ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య భీకర యుద్ధంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధాన్ని తక్షణమే ముగించాలని కోరింది. దౌత్య చర్చలతోనే శాంతి సాధ్యమని అభిప్రాయపడింది. ఈ మేరకు భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని వెంటనే నిలిపివేయాలని సూచించారు. ఇంధన వ్యవస్థలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీస్ పై జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అభిప్రాయ పడ్డారు. ఇలాంటి దాడులు ప్రపంచ ఇంధన రంగాన్ని మరింత అస్థిర పరుస్తాయని అన్నారు. ఈ మేరకు చమురు సంస్థలు, గ్యాస్ ప్లాంట్స్ పై దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ దాడుల కారణంగా ప్రపంచ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

India Urges Immediate End to Attacks on Oil Refineries Amid Iran-Israel-US Conflict India urges

మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధంపై ప్రధాని మోదీ.. ఒమన్ సుల్తాన్, మలేషియా ప్రధానితో ఫోన్ లో చర్చలు జరిపారు. ఈ మేరకు తాజా పరిస్థితులపై మాట్లాడారు. ఈ విషయాలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఒమన్ పై దాడులను ఖండించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. చర్చల ద్వారానే పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+