వివాదాస్పదమైన ఫెవిక్విక్ యాడ్: వెంటనే తీసేయండి లేకుంటే ఆందోళన(వీడియో)
న్యూఢిల్లీ: టీవీ ఛానల్స్‌లో వచ్చే ఫెవిక్విక్ యాడ్స్ చాలా సరదాగా, ఫన్నీగా ఉంటాయి. అయితే తాజాగా టీవీ ఛానల్స్‌లో దర్శనమిస్తున్న ఫెవిక్విక్ యాడ్ మాత్రం అందుకు భిన్నంగా ఉందంటూ, ఆ యాడ్‌పై హిందూ జనజాగృతి సమితి (హెచ్‌జేఎస్) అభ్యంతరం తెలిపింది.
అంతలా అభ్యంతరం తెలిపే ఆ యాడ్‌లో ఏముంది? అందులో భారత్ పాక్ అంతర్జాతీయ వాఘా సరిహద్దులో నిర్వహించే 'బీటింగ్ ద రిట్రీట్' సందర్భంగా ఓ భారత సైనికుడు పాకిస్ధాన్ సైనికుడి బూటును ఫెవిక్విక్‌తో అతికించడం కనిపిస్తుంది.

దేశ సరిహద్దుల్లో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న మన సైనికులను అసమంజసమైన రీతిలో చిత్రీకరించారని హిందూ జనజాగృతి సమితి జాతీయ ప్రతినిధి రమేశ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాడ్‌పై ఫెవిక్విక్ తయారీదారైన పిడిలైట్ సంస్ధ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాత్రింబవళ్లు మన సైనికులు సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుంటే, ఇలాంటి యాడ్‌లు రూపొందించడం దేశ ప్రజల మనోభావాలను గాయపర్చడమేనని అన్నారు. ఈ యాడ్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకుంటే, పిఢిలైట్ సంస్ధకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామన్నారు.
ఫెవిక్విక్ యాడ్‌ను ఇక్కడ వీక్షించండి:
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications