త్వరలో లిస్ట్: నల్లకుబేరుల వివరాలివ్వాలని స్విస్‌కు లేఖ
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులలో భారతీయులు దాచుకున్న నల్లధనం ఖాతాల వివరాలు, వారి పేర్లను తెలియజేయాలని భారత ఆర్థిక శాఖ తాజాగా స్విట్జర్లాండ్‌ను అభ్యర్థిస్తూ లేఖ రాసింది. భారత్‌కు చెందిన నల్ల కుబేరుల జాబితా కోసం తాము స్విస్ అధికారులకు లేఖ రాశామని భారత ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారట.
ఉభయ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒడంబడికలు, పరస్పరం అనుసరించాల్సిన నియమ నిబంధనలు ఇతర అంశాలన్నింటినీ ఈ లేఖలో ఉటంకించినట్లు సదరు అధికారి తెలిపారు. నల్ల కుబేరులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సిద్ధంగా ఉన్నారని సదరు అధికారి తెలిపారు.

ఇటీవలే స్విస్ ప్రభుత్వాధికారి ఒకరు భారత నల్ల కుబేరుల జాబితాను ప్రభుత్వానికి తెలియజేసేందుకు స్విట్జర్లాండు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన స్విట్జర్లాండ్ సచివాలయ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా భారత సర్కార్ చేస్తున్న పోరాటంలో స్విట్జర్లాండ్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. మరోవైపు, భారత ప్రభుత్వం స్విట్జర్లాండుకు ఆదివారం ఈ లేఖ రాసిందని సమాచారం.












Click it and Unblock the Notifications