అమెరికాలో మరో భారతీయ అమెరికన్ అనుమానాస్పద మృతి
అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ కు చెందిన ఓ అమ్మాయిపై దుండగుడు కాల్పులు జరపడంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇది ఇలా ఉండగా, ఓ ప్రవాస భారతీయుడు అనుమానాస్ప
న్యూయార్క్: అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ కు చెందిన ఓ అమ్మాయిపై దుండగుడు కాల్పులు జరపడంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇది ఇలా ఉండగా, ఓ ప్రవాస భారతీయుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే అతడి కుటుంబసభ్యులు మాత్రం ఇది తమ కుటుంబ వ్యక్తిగత అంశమని స్పష్టంచేశారు. న్యూజెర్సీలో గతవారం 29ఏళ్ల భారతీయ అమెరికన్ మృతదేహం లభ్యమైంది. అతడి మరణానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు.

ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందలేదు. కాగా, అమెరికాలో వరుసగా భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఘటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మృతుడి తండ్రి మసాచుసెట్స్‌లో ఉంటున్నారని, ఆయనతో భారత కాన్సులేట్ అధికారులు మాట్లాడారని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. ఇది వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషాదమని ఆయన తెలిపారని స్పష్టంచేశారు. అలాగే తమ కుటుంబానికి ప్రైవసీ కావాలని కోరారని వెల్లడించారు.
కాగా, ఇటీవల దుండగుల కాల్పుల్లో వంశీ, శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీశ్ పటేల్ అమెరికాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. తాజాగా మరో భారత అమ్మాయిపై కాల్పులు జరిగాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, జరిగిన ఈ ఘటనలన్నింటిపైనా దర్యాప్తు చేస్తున్నామని, బాధితులకు న్యాయం చేస్తామని అమెరికా ప్రభుత్వం చెబుతోంది.
-
వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..! -
ఇరాన్ వార్ వ్యతిరేకించిన అధికారికి ట్రంప్ షాక్..! వైట్ హౌస్ కీలక నిర్ణయం..! -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు












Click it and Unblock the Notifications