పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ గూఢచారిని ఇండియన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. రాజస్థాన్ లోని భారత్- పాకిస్థాన్ సరిహద్దులో ఈ గూఢచారిని బీఎస్ఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ గూఢచారిని విచారిస్తున్నారు అధికారులు.
పాకిస్థాన్ గూఢచారి సరిహద్దు దాటడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ వద్ద అతడ్ని అదుపులోకి తీసుకుంది భారత ఆర్మీ. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాక్ రేంజర్ ను క్వాజా మీర్ గా అధికారులు గుర్తించారు. కోవర్టు ఆపరేషన్‌లో భాగంగా బార్డర్ దాటినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ యుద్ధ ప్రయత్నాలను తెలుసుకునేందుకే సరిహద్దు దాటినట్లు భావిస్తున్నారు.
మరోవైపు జమ్ముకాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలో గల ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7.. లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ జరిగింది. దాదాపుగా గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
#BREAKING: 🇮🇳 BSF apprehends Pakistani Ranger illegally crossing India-Pakistan border in Sri Ganganagar, Rajasthan, opposite Fort Abbas. Suspected of spying, the Ranger was arrested by vigilant BSF Jawans.#IndiaPakistanWar #IndiaPakistanTensions pic.twitter.com/eWN8IEGv9G
— Saffron Force 🇮🇳 (@SaffronForceInd) May 3, 2025
ఇప్పటికే సింధూ జలాల రద్దుతోపాటు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అలాగే పాకిస్థాన్ కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కు ప్రతిపాదనలు పంపింది. దీంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications