మీ టాలెంట్ కు ఇండియన్ ఆర్మీ అవకాశం.. పలు విభాగాల్లో పోటీలు
ఢిల్లీ : జనవరి 15న ఇండియన్ ఆర్మీ డే ఘనంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది భారత సైనిక దళం. అందులో భాగంగా ఆన్‌లైన్ పోటీలు నిర్వహిస్తోంది. "ఇండియన్ ఆర్మీ - నేషన్ ఫస్ట్" థీమ్ తో పలు విభాగాల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ పెయింటింగ్, ఫోటోగ్రఫీ, స్లోగన్, వీడియో తదితర అంశాల్లో మీ ఎంట్రీలు పంపొచ్చు. భారతీయ పౌరులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. డిసెంబర్ 4 నుంచి ప్రారంభమైన దరఖాస్తులకు చివరితేది జనవరి 9.
On 15 January 2019 #IndianArmy celebrates Army Day. It is celebration of commitment to idea of Nation First. This #ArmyDay participate in online Painting, Photography,Slogan & Video competitions. Competitions are open from 4 Dec 2018 to 9 Jan 2019.
— ADG PI - INDIAN ARMY (@adgpi) December 24, 2018
Click https://t.co/fSUHdeuoIN pic.twitter.com/S5EPg8HEYC
ఎలా దరఖాస్తు చేయాలి :

ఎంట్రీలు పంపాలనుకునేవారు తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసి ADGPI (Indian army facebook page) కు ట్యాగ్ చేయాలి. అలాగే సాఫ్ట్‌కాపీలు కూడా పంపాల్సి ఉంటుంది. పేరు, అడ్రస్, జన్మదినం, ఎంట్రీలు తమ సొంతమని నిర్ధారించే ధృవపత్రం తదితర వివరాలు [email protected] కు పంపాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన బెస్ట్ ఎంట్రీలు ADGPI facebook page లో చూసుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాల కోసం కింది లింక్ మీద క్లిక్ చేయండి.
bit.ly/2Gn6B69.












Click it and Unblock the Notifications