Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత సైన్యం చేతికి 'షేర్' మెషిన్ గన్.. నిమిషానికి 700 బుల్లెట్లు..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అస్థిరత నెలకొంది. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- ఇరాన్, ఇజ్రాయెల్- గాజా, యెమెన్- సిరియా, చైనా- తైవాన్, పాకిస్థాన్- బలూచిస్థాన్.. ఇలా సరిహద్దు దేశాలు నువ్వా నేనా అన్నట్లు దాడులు చేసుకుంటున్నాయి. ఇక భారత్ కు పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటోంది. ఈ క్రమంలో భారత అమ్ముల పొదిలోకి మరో శక్తివంతమైన ఆయుధం చేరనుంది.

భారత సైన్యం చేతికి త్వరలో అత్యంత శక్తివంతమైన ఏకే-203 రైఫిల్స్ చేరనున్నాయి. ఈ మేరకు తొలి బ్యాచ్ ఆయుధాలను భారత్ కు ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇండో- రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ సంయుక్తంగా అమేథీలో వీటి నిర్మాణం చేపట్టాయి. ఈ మేరకు భారత్- రష్యా మధ్య రూ. 5,200 కోట్ల ఒప్పందాలు జరిగాయి. డీల్ లో భాగంగా ఇప్పటికే 48 వేల ఏకే- 203 రైఫిల్స్ ను సిద్ధం చేసినట్లు సమాచారం.

గతంలో పేరొందిన కళాష్నికోవ్ సిరీస్ ను మరింతగా అప్డేట్ చేసి వీటిని తయారు చేశారు. ఈ రైఫిల్స్ నిమిషానికి 700 రౌండ్ల బుల్లెట్స్ తో దాడి చేయగలవు. వీటి రేంజ్ 800 మీటర్ల వరకు ఉంటుంది. ఈ రైఫిల్ కు షేర్ అని నామకరణం చేశారు. ది ఇండో- రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా ఈ రైఫిల్స్ ను ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీలో తయారు చేస్తోంది.

ఈ మేరకు ఇరు సంస్థల మధ్య రూ.5,200 కోట్ల ఒప్పందం జరిగినట్లు మేజర్ జనరల్ ఎస్ కే శర్మ పేర్కొన్నారు. డిసెంబర్ 2030 నాటికి 6 లక్షలకు పైగా ఏకే- 203 రైఫిల్స్ అందించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 48 వేల రైఫిళ్లను ఇచ్చేశామని, మరో మూడు వారాల్లోగా మరో 7 వేల రైఫిళ్లు అందజేస్తామని, డిసెంబరు నాటికి 15 వేల రైఫిళ్లు అదనంగా అందజేయడానికి సిద్దంగా ఉన్నామని శర్మ తెలిపారు.

Indian Army to Get Powerful AK-203 Rifles from Amethi Plant

ఇక ఈ ఏకే- 203 రైఫిల్స్ బరువు 3.8 కేజీలు ఉంటుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఏకే-47, ఏకే-57 రైఫిల్స్ బరువు 4.15 కేజీలు ఉంటుంది. అంటే వాటితో పోల్చితే బరువు తక్కువే. కాగా పొడవు కూడా తక్కువగానే 705 ఎంఎం మాత్రమే ఉంది. ఈ రైఫిల్స్ ను పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దు, నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంట గస్తీ నిర్వహిస్తున్న సైనికుల చేతికి అందించాలని కేంద్ర రక్షణ మంత్రత్వ శాఖ భావిస్తోంది.

ఇటీవలే భారత నేవీ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు మోస్ట్ అడ్వాన్స్ డ్ స్టీల్త్ ఫ్రిగేట్ రంగానికి చెందిన INS తమాల్ యుద్ధ నౌక సేవలను ప్రారంభించింది. అమెరికా నుంచి మూడు అపాచీ హెలికాప్టర్లు ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమెరికా- భారత్ మధ్య 2020లో 600 మిలియన్ల డాలర్లతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం భారత్ కు అమెరికా 6 అపాచీ హెలికాప్టర్లు అందించాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+