బిలియనీర్ Harsh Goenkaకి గట్టిగా ఇచ్చిపడేసిన నెటిజన్లు.. ఏమైందంటే..?

Harsh Goenka: దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన హర్ష్ గోయెంకా కూడా ఒకరు. అంబానీ, అదానీ, టాటా, బిర్లాల మాదిరిగా పెద్దగా వార్తల్లో నిలవనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటుంటారు. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు. భారతీయులు ప్రతిరోజూ రూ.600 ఆదా చేయాలన సూచన ఇచ్చారు. అయితే ఇది పెద్ద విమర్శలకు దారితీసింది.

ప్రస్తుతం 66 ఏళ్ల హర్ష్ గోయెంకా కోల్‌కతాకు చెందిన వ్యక్తి. గోయెంకా ఆర్‌బీజే గ్రూప్‌ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన KEC ఇంటర్నేషనల్, CEAT టైర్లు, జెన్సార్ టెక్నాలజీతో సహా 15 కంపెనీలు ఈ RBJ గ్రూప్ క్రింద పనిచేస్తున్నాయి. హర్ష్ గోయెంకా 1998 నుంచి ఈ గ్రూప్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ప్రస్తుతం ఆయన 1434వ స్థానంలో నిలిచారు. గోయెంకా నికర విలువ దాదాపు రూ.25,000 కోట్లుగా ఉంది. చిన్న అలవాట్లు మనకు పెద్ద ఫలితాలను ఇస్తాయని హర్ష్ గోయెంకా తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ రోజుకు రూ.600 ఆదా చేస్తే, మీరు ఒక ఏడాదికి రూ.2,19,000 పొందుతారని అన్నారు.

Indian Billionaire Harsh Goenka comments to save money got backfired in Twitter from users

అదే విధంగా మీరు రోజుకు 20 పేజీలు పుస్తకాన్ని చదివితే మీరు ఒక ఏడాదిలో దాదాపు 30 పుస్తకాలను చదవగలరు, రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల ఏడాదికి 70 మారథాన్‌లను పరిగెత్తడంతో సమానం అని తన పోస్టులో పేర్కొన్నారు. జీవితంలో చిన్న అలవాట్లు పెనుమార్పులు తెస్తాయని పోస్ట్ చేశాడు. కానీ ఈ పోస్టుపై కొందరు తమ వ్యతిరేకతను వెల్లడించారు. ఎందుకంటే సగటు భారతీయుడు రోజుకు రూ.600 ఆదా చేయగలడా అనే ప్రశ్నను కూడా వారు లేవనెత్తారు. దేశంలోని 90 శాతం మంది ప్రజలు రోజుకు రూ.600 సంపాదించటానికి కష్టపడుతున్నారని, అలాంటప్పుడు వారు రూ.600 ఎలా సేవ్ చేయగలరని నెటిజన్లు వ్యాపారవేత్తను ప్రశ్నించారు.

భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరు సగటు భారతీయులు ఎలా పొదుపు చేయాలో సూచిస్తుండడం ఒక జోక్ అంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఒక పుస్తకంలోని 20 పేజీలు చదవడానికి సమయం ఉద్యోగులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేయడానికి, ఉద్యోగులకు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి సమయం ఇవ్వాలన్నారు. హర్ష్ గోయెంకా వాస్తవికతకు దూరంగా ఉన్నారని చాలా మంది అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+