టెక్కీలకు 9 దేశాల్లో 1.7 లక్షల ఉద్యోగాలు
ప్రపంచవ్యాప్తంగా వీసా ప్రోగ్రామ్స్ లో కఠినతరమైన నిబంధనలు తీసుకొన్న తరుణంలో కూడ ఆసియా పసిఫిక్ రీజియన్ లోని 9 దేశాల్లో కనీసం 1.7 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించినట్టు ప్రభుత్వం తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వీసా ప్రోగ్రామ్స్ లో కఠినతరమైన నిబంధనలు తీసుకొన్న తరుణంలో కూడ ఆసియా పసిఫిక్ రీజియన్ లోని 9 దేశాల్లో కనీసం 1.7 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించినట్టు ప్రభుత్వం తెలిపింది.
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ఇటీవలే ఈ అంశం తెరమీదికి వచ్చింది. చైనా,జపాన్ దక్షిణకొరియా , అస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఆసియన్ దేశాలు ఈ ఒప్పందంలో భాగమయ్యాయి.

కేవలం భారతీయ నిపుణులు తమ ఆర్థిక వ్యవస్థలకు సహకరించడమే కాకుండా విప్రో, ఇన్పోసిస్, టీసీఎస్, హెసీఎల్ వంటి టెక్ కంపెనీలు కూడ వేలాది ఉద్యోగాలను కల్పిస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ భారత ఉద్యోగులకు షాకిస్తున్నాయి. భారతీయ నిపుణులను అనుమతించే విషయంలో సింగపూర్ తన కమిట్ మెంట్ ను మరిచిపోయిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అస్ట్రేలియా కూడ విదేశీయుల వీసాల్లో కఠినతరమైన రూల్స్ ను తెచ్చింది.
ఈ విషయమై అస్ట్రేలియా ప్రధానితో నరేంద్రమోడీ చర్చించారు. ఫిలిఫ్పిన్స్ లో కార్యకలాపాలు నిర్వహించే దేశీయ ఐటీ సంస్థలు స్థానికంగా 60 వేల ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపింది. కానీ, కేవలం రెండువేల మందికి లోపుగానే వర్క్ పర్మిట్స్ అవసరం పడినట్టు వెల్లడించింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications