Mohammed shami: షమీ ఇప్పటికీ వారి వద్దకు వెళ్తాడు.. సుప్రీం కోర్టుకెక్కిన భార్య హసీన్ జహాన్..
భారత క్రికెటర్ మహ్మద్ షమీ(Mohammed shami)తో కొంత కాలంగా దూరంగా ఉంటున్న ఆయన భార్య హసీన్ జహాన్ షమీపై పలు ఆరోపణలు చేశారు. షమీపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. గత 4 సంవత్సరాలుగా షమీ అరెస్ట్ వారెంట్ పై ఉన్న స్టేను ఎత్తేయాలని సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. షమీ జాతీయ క్రికెట్ జట్టుతో పర్యటనలలో ఉన్నప్పుడు కూడా వేశ్యలతో వివాహేతర సంబంధాలు కొనసాగించారని ఆరోపించింది. ఇప్పటికీ కూడా సంబంధాలు కొనసాగిస్తున్నాడని చెప్పారు.
హసిన్ జహాన్ 2018లో జాదవ్‌పూర్‌లో షమీరై పోలీసులకు ఫిర్యాదు చేశారు. షమీ తనపై గృహహింస పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పుడు కూడా షమీపై వ్యభిచార ఆరోపణలు చేశారు. షమీ, అతని అన్నయ్య హసీబ్ అహ్మద్‌లను కోల్‌కతా పోలీసుల విచారించారు కూడా. 2019 అలీపూర్ కోర్టు భారత క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఆ తర్వాత అరెస్ట్ వారెంట్‌పై స్టే విధించారు. హసిన్ జహాన్ షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన భారత క్రికెట్ బోర్డు (BCCI) అవినీతి నిరోధక విభాగం షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది.

అరెస్ట్ వారెంట్ పై హసిన జహాన్ పశ్చమ బంగా హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే అక్కడ కూడా ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అరెస్ట్ వారెంట్ పై స్టే ఎత్తివేయాలని హసిన జహాన్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. షమీ వరకట్నం అడిగేవాడని హసిన్ జహాన్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఐపిఎల్‌లో మోడల్‌గా, చీర్‌లీడర్‌గా పనిచేసిన హసిన్ జహాన్ "సీనియర్ జాతీయ క్రికెట్ జట్టు పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నాడని" అని పేర్కొంది.
కోర్టులో హసిన్ జహాన్ ఆరోపణలు నిజమని రుజువైతే ఆమెకు క్షమాపణలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మహ్మద్ షమీ స్పష్టం చేశారు. గతంలో హసిన్ జహాన్‌కు నెలవారీగా రూ. 50,000 భరణం చెల్లించాలని షమీని ఆదేశించింది. అయితే దీనిపై సంతృప్తి చెందని జహాన్ నెలకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసింది. 2018లో జహాన్ నెలవారీ రూ. 10 లక్షల భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో వ్యక్తిగత ఖర్చుల కోసం రూ. 7 లక్షలు, కుమార్తె పోషణ కోసం రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications