టెక్కీలకు శుభవార్త: ఐటీలో భారీగా రిక్రూట్‌మెంట్లు, 550 కంపెనీల ఫోకస్
న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగం కోసం ఎదురు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఖచ్చితంగా ఇది తీపికబురే. వచ్చే ఆరు నెలల్లో ఐటీ సంస్థల భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. ప్రధానంగా జూనియర్ లెవల్ ఉద్యోగాలను పెద్ద ఎత్తున రిక్రూట్ చేస్తాయని ఎక్స్పర్టీస్ ఐటీ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వే వెల్లడించింది.

నియామకాల ఊపు
అమెరికాలో ప్రతిపాదిత వీసా నియంత్రణ నేపథ్యంలో భారత్‌లో గత కొద్ది నెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. రానున్న రెండు త్రైమాసికాల్లో ఐటీ రంగంలో నియామకాలు చేపట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

నియామకాలపై దృష్టి..
భారీ ఐటీ దిగ్గజాలు హైరింగ్ ప్రణాళికలకు పదునుపెడుతుండగా, నాన్ ఐటీ కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లేందుకు అనుగుణంగా సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టి సారించాయని పేర్కొంది.

జూనియర్ లెవల్‌లో..
ఐటీ కంపెనీలు జూనియర్ లెవల్‌లో నియామకాలను పెద్ద ఎత్తున చేపడతాయని, సృజనాత్మకత, వినూత్న ఆలోచనా దోరణి కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తాయని నివేదిక వెల్లడించింది.

550 ఐటీ కంపెనీలు..
కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలపై స్టార్టప్‌లు పనిచేస్తుండటంతో స్టార్టప్‌లలోనూ నియామకాలు భారీగా ఉంటాయని నివేదిక అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 550 ఐటీ కంపెనీల యాజమాన్యాలతో ఇంటర్వ్యూల ద్వారా వారి హైరింగ్ ప్రణాళికలను సర్వే పేర్కొంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications