భారత్‌లో అల్‌ఖైదా సాధ్యంకాదా: ముస్లిం పెద్దల ఖండన

న్యూఢిల్లీ: భారత ఉపఖండంలోను అల్‌ఖైదాను విస్తరించాలన్న అల్ జవహరి వ్యూహాన్ని భారత ముస్లిం మతపెద్దలు ఖండించారు. సున్నీ మార్క్‌జ సీరత్ కమిటీ, ఇతర స్థానిక ముస్లీం గ్రూపులకు చెందిన ప్రతినిధులు ఈ మేరకు ఒక లేఖను, భద్రకాళీ పోలీస్ స్టేషన్లో అందించారని పోలీసు కమిషనర్ కెకె సరంగల్ శనివారం తెలిపారు. ముస్లిం సమాజానికి భారత్ ప్రియమైనదని, జాతీయ సమైక్యతను వారంతా బలపరుస్తూ వస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

తమ ప్రాణాలకంటే మిన్నగా దేశాన్ని ప్రేమిస్తున్నామన్నారు. అది ఎల్లప్పుడు కొనసాగుతుందన్నారు. అల్‌ఖైదాకు భారత్‌లో స్థానం లేదని వాషింగ్టన్ భారతీయ అమెరికన్ ముస్లిం మండలి పేర్కొంది. భారత్‌కు విస్తరించాలన్న అల్‌ఖైదా చర్య అవాంచితమని, దీనివల్ల భారతీయ ముస్లింలు బాధితులుగా మిగిలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ పట్ల అల్‌ కాయిదా కలలు ఎన్నటికీ నెరవేరవని శివసేన పార్టీ తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.

కాగా, భారత ఉపఖండంలో తమ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చేసిన ప్రకటనపై ఇటు భారత్‌తోపాటు అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. అయితే భారత్‌లో తన ‘కాయిదత్‌ అల్‌ జిహాద్‌' గ్రూపును ఏర్పాటు చేయడం అల్‌ కాయిదాకు సాధ్యపడదని ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి.

 న్యూఢిల్లీ: భారత ఉపఖండంలోను అల్‌ఖైదాను విస్తరించాలన్న అల్ జవహరి వ్యూహాన్ని భారత ముస్లిం మతపెద్దలు ఖండించారు. సున్నీ మార్క్‌జ సీరత్ కమిటీ, ఇతర స్థానిక ముస్లీం గ్రూపులకు చెందిన ప్రతినిధులు ఈ మేరకు ఒక లేఖను, భద్రకాళీ పోలీస్ స్టేషన్లో అందించారని పోలీసు కమిషనర్ కెకె సరంగల్ శనివారం తెలిపారు. ముస్లిం సమాజానికి భారత్ ప్రియమైనదని, జాతీయ సమైక్యతను వారంతా బలపరుస్తూ వస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తమ ప్రాణాలకంటే మిన్నగా దేశాన్ని ప్రేమిస్తున్నామన్నారు. అది ఎల్లప్పుడు కొనసాగుతుందన్నారు. అల్‌ఖైదాకు భారత్‌లో స్థానం లేదని వాషింగ్టన్ భారతీయ అమెరికన్ ముస్లిం మండలి పేర్కొంది. భారత్‌కు విస్తరించాలన్న అల్‌ఖైదా చర్య అవాంచితమని, దీనివల్ల భారతీయ ముస్లింలు బాధితులుగా మిగిలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ పట్ల అల్‌ కాయిదా కలలు ఎన్నటికీ నెరవేరవని శివసేన పార్టీ తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. కాగా, భారత ఉపఖండంలో తమ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చేసిన ప్రకటనపై ఇటు భారత్‌తోపాటు అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. అయితే భారత్‌లో తన ‘కాయిదత్‌ అల్‌ జిహాద్‌’ గ్రూపును ఏర్పాటు చేయడం అల్‌ కాయిదాకు సాధ్యపడదని ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేలా కొన్ని ఉగ్రవాద శక్తులు ఉండొచ్చేమోగానీ, వారికి ఇక్కడ తిష్ట వేసే అవకాశాన్ని భారత్‌ ఇవ్వబోదని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లోని ఒక సీనియర్‌ అధికారి విశ్లేషించారు. అల్‌ కాయిదా నేత అల్‌ జవహరి వీడియో విడుదల నేపథ్యంలో భారత్‌లోని పరిస్థితులపై ఈ అధికారి మాట్లాడారు. రెండు దశాబ్దాలకుపైగా ఐబీలో ఆయన పని చేస్తున్నారు. కోల్పోతున్న ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని, ఇలాంటి వీడియోల ద్వారా కేడర్‌ను భర్తీ చేసుకోవాలని చూస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లష్క రే తాయిబా, ఇసిస్‌ వంటి ఉగ్రవాద సంస్థల వల్ల ఉనికే కోల్పోయే స్థితిలో అల్‌ఖైదా ఉంది తప్ప, పెద్ద పెద్ద దాడులు చేసే స్థాయిలో లేదని వారంటున్నారు. మరోవైపు, అప్రమత్తమైన ఇంటెలిజెన్స్‌ వర్గాలు దేశవ్యాప్తంగా అలెర్ట్‌ ప్రకటించారు. కాగా, భారత్‌లో ఏర్పాటు కానున్న తమ గ్రూపు లక్ష్యాల్లో అమెరికా కూడా ఉందని ‘కాయిదత్‌ అల్‌ జిహాద్‌’ అధికార ప్రతినిధి ఉసామా మొహమ్మద్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. అల్‌ఖైదాను తుద ముట్టిస్తామని ప్రకటించిన అమెరికా... 9/11 దాడుల ఘటన సమీపిస్తున్న నేపథ్యంలో అల్‌ఖైదా నుంచి ఇలాంటి వీడియో ప్రకటన రావడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అమెరికాతోపాటు ఏ దేశానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నా ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపుని చ్చింది.

ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేలా కొన్ని ఉగ్రవాద శక్తులు ఉండొచ్చేమోగానీ, వారికి ఇక్కడ తిష్ట వేసే అవకాశాన్ని భారత్‌ ఇవ్వబోదని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లోని ఒక సీనియర్‌ అధికారి విశ్లేషించారు. అల్‌ కాయిదా నేత అల్‌ జవహరి వీడియో విడుదల నేపథ్యంలో భారత్‌లోని పరిస్థితులపై ఈ అధికారి మాట్లాడారు.

రెండు దశాబ్దాలకుపైగా ఐబీలో ఆయన పని చేస్తున్నారు. కోల్పోతున్న ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని, ఇలాంటి వీడియోల ద్వారా కేడర్‌ను భర్తీ చేసుకోవాలని చూస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లష్క రే తాయిబా, ఇసిస్‌ వంటి ఉగ్రవాద సంస్థల వల్ల ఉనికే కోల్పోయే స్థితిలో అల్‌ఖైదా ఉంది తప్ప, పెద్ద పెద్ద దాడులు చేసే స్థాయిలో లేదని వారంటున్నారు. మరోవైపు, అప్రమత్తమైన ఇంటెలిజెన్స్‌ వర్గాలు దేశవ్యాప్తంగా అలెర్ట్‌ ప్రకటించారు.

కాగా, భారత్‌లో ఏర్పాటు కానున్న తమ గ్రూపు లక్ష్యాల్లో అమెరికా కూడా ఉందని ‘కాయిదత్‌ అల్‌ జిహాద్‌' అధికార ప్రతినిధి ఉసామా మొహమ్మద్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. అల్‌ఖైదాను తుద ముట్టిస్తామని ప్రకటించిన అమెరికా... 9/11 దాడుల ఘటన సమీపిస్తున్న నేపథ్యంలో అల్‌ఖైదా నుంచి ఇలాంటి వీడియో ప్రకటన రావడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అమెరికాతోపాటు ఏ దేశానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నా ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపుని చ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+